Saturday, June 19, 2021

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే..!

Must Read

బిగ్‌బాస్‌ షో.. దీని గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. భాష ఏదైనా కూడా ఈ షో మొదలైతే చాలు అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. ఇక తెలుగులో అయితే వేరే లెవెల్ అనుకోండి. మొదటి సీజన్‌ నుంచి ఈ షో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. వాస్తవానికి బిగ్ బాస్ సీజన్ 5 ఈ సమ్మర్‌లో ప్రారంభించాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది కాస్తా వాయిదా పడింది. జులైలోనే ఈ సీజన్ 5 కూడా షురూ కానుందని విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఎంత కష్టమైనా కూడా 2021 జులైలో సీజన్ 5 మొదలు పెట్టాలని చూస్తున్నారు.

వచ్చే సీజన్ కూడా కచ్చితంగా నాగార్జున హోస్ట్ చేస్తాడు ఆ కన్ఫ్యూజన్ అయితే ఎవరికీ లేదు. పైగా కంటెస్టెంట్స్ ఎంపిక కూడా గత సీజన్ మాదిరే జూమ్ యాప్‌లో ఎంపిక చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. వారం పదిరోజుల్లో కంటెస్టెంట్లను ఖరారు చేసి.. క్వారంటైన్‌లో ఉంచిన తర్వాత సీజన్ స్టార్ట్ చేయనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. బాస్ సీజన్ 5లో పాల్గొనబోతున్న కంటెస్టెంట్స్ పేర్లు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఆ లిస్ట్ ఇదే..

  1. షణ్ముఖ్‌ జశ్వంత్
  2. టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు
  3. యాంకర్ వర్షిణి
  4. కమెడియన్‌ ప్రవీణ్‌
  5. యాంకర్ శివ
  6. శేఖర్ మాస్టర్
  7. హైపర్ ఆది
  8. సింగర్‌ మంగ్లీ
  9. న్యూస్ యాంకర్ ప్రత్యూష
  10. టిక్ టాక్ స్టార్ భాను
Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This