Saturday, June 19, 2021

బిగ్ బాస్ సీజ‌న్ 5 డేట్ ఫిక్స్..! అద్దరిపోయే 2 అప్ డేట్స్

Must Read

తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ షో కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌ల్సిన‌వ‌స‌రం లేదు. ఇప్ప‌టివ‌ర‌కూ బిగ్ బాస్ నాలుగు సీజ‌న్ ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. అంతే కాకుండా నాలుగో సీజ‌న్ కు గ‌త మూడు సీజ‌న్ల కంటే ఎక్కువ TRP వ‌చ్చింది. దాంతో నాలుగో సీజ‌న్ పూర్త‌యిన వెంట‌నే సీజ‌న్ 5 ను కూడా ప్రారంభించాల‌ని మేక‌ర్స్ అనుకున్నారు. కానీ క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతితో లేట్ అయ్యింది. ఇక ఇప్పుడు సీజ‌న్ 5 కోసం బిగ్ బాస్ నిర్వాహ‌కులు అభ్యర్థుల‌ను ఎంపిక చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే నేరుగా అభ్య‌ర్థుల‌ను క‌ల‌వ‌కుండా జూమ్ వీడియో కాల్ ద్వారా అభ్య‌ర్థులను సెలెక్ట్ చేస్తున్నారంట.

అంతే కాకుండా వీలైనంత త్వ‌రగా బిగ్ బాస్ సీజ‌న్ 5 ను ప్రారంభించాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. జూలై లో షోను ప్రారంభించే దిశ‌గా అన్ని ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే మాటీవీ ఆఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతున్న‌ట్టు స‌మాచారం. ఇక ఈ సీజ‌న్ కు కూడా నాగార్జున యే హోస్ట్ గా చేయ‌బోతున్నారు.

అంతే కాకుండా అన్న‌పూర్ణ స్టూడియోలోనే మ‌ళ్లీ బిగ్ బాస్ హౌస్ సెట్ ను ఏర్పాటు చేయ‌బోతున్నారు. ఇక గ‌త సీజ‌న్ లో ప్రేక్ష‌కులు అభ్య‌ర్థుల విష‌యంలో ఎంతో నిరాశ చెందారు. కాబ‌ట్టి ఈ సీజ‌న్ లో కంటెస్టెంట్ల విష‌యంలో మేక‌ర్స్ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకునే అవ‌కాశం ఉంది. మ‌రి ఈ సీజ‌న్ లో ఎంత మంది సెలబ్రిటీలు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This