Friday, July 30, 2021

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ను కలిసిన టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల

Must Read

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో ఓ భారీ మూవీ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. గత నెలలో ఈ విషయాన్నీ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రకటించగా… సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై ఈ ప్రాజెక్టును తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరించి విడుదల చేయనున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల, నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్, భారత్ నారంగ్, పి రామ్ మోహన్ లతో కలిసి ధనుష్ ను హైదరాబాద్ లో మీట్ అయ్యారు.

ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన ధనుష్ తిరిగి వచ్చేటప్పుడు హైదరాబాద్ లో ఫ్లైట్ దిగాడు. అమెరికాలో “గ్రే మ్యాన్” షూటింగ్ ను పూర్తి చేసుకుని ఇండియా తిరిగొచ్చాడు ధనుష్. అయితే ఆయన డైరెక్ట్ గా తన సినిమా “D43” షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. ఇక ఈ మీటింగ్ లో శేఖర్ కమ్ముల ఈ టాలెంటెడ్ హీరోతో స్క్రిప్ట్ గురించి చర్చించారు. ఈ బృందం ప్రస్తుతం వివిధ భాషలకు చెందిన కొంతమంది ప్రతిభావంతులైన నటులతో, ప్రఖ్యాత సాంకేతిక బృందంతో చర్చలు జరుపుతోంది. ఈ ఏడాది చివర్లో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు ధనుష్ చివరిసారిగా “జగమే తందిరం”లో కనిపించాడు. హిందీ చిత్రం “అత్రాంగి రే” షూటింగ్‌ను కూడా ఆయన పూర్తి చేశారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This