Saturday, June 19, 2021

హీరో వేణు గుర్తున్నాడా..? అవకాశాలు లేక ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?

Must Read

వేణు తొట్టంపూడి.. హీరోగా, కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో అలరించిన ఆయన కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. 1999లో వచ్చిన స్వయంవరం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వేణు తక్కువ సమయంలోనే నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. తొలి సినిమాతోనే నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ ను వేణు అందుకున్నారు. ఆ తరువాత వేణు నటించిన చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కళ్యాణరాముడు, పెళ్లాం ఊరెళితే, ఖుషిఖుషీగా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్లుగా నిలిచాయి. అయితే గత కొన్నేళ్లుగా వేణు సినిమాల్లో నటించడం లేదు. కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు.

అలా 2009లో ‘గోపి గోపిక గోదారి’ మూవీలో నటించి కాస్తా బ్రేక్‌ తీసుకున్నాడు. కాగా ఇందులో హీరోయిన్‌గా కమలిని ముఖర్జీ నటించింది. ఈ సినిమా కూడా వేణు కేరీర్‌కు మంచి హిట్‌ అందించింది. అయితే ఈ మూవీ తర్వాత ఆయన బ్రేక్‌ ఇవ్వడంతో తన సినీ కేరీర్‌ కాస్తా వెనకపడింది. ఈ నేపథ్యంలో మంచి అవకాశం కోసం ఎదురు చూసిన ఆయనకు బోయపాటి, జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో 2012లో వచ్చిన దమ్ము చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించాడు.

కానీ ఆ సినిమా పెద్ద‌గా ఆడ‌లేదు. ఆ త‌ర్వాత రామాచారి సినిమా చేసినా అది కూడా ప‌రాజ‌యం పాలైంది. దీంతో వ్యాపారంపై దృష్టి పెట్టిన ఆయన ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పి తను చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. అయితే ఇప్పటికి మంచి అవకాశం వస్తే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు పలు ఇంటర్వ్యూలో చెప్పాడు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This