Saturday, June 19, 2021

హీరో అబ్బాస్ భార్య ఎంత పెద్ద స్టార్ హీరోయినో తెలుసా ?

Must Read

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొంతమంది యువ హీరోలు ఒక్కప్పుడు ఇండస్ట్రీ లో తిరుగులేని బ్లాక్ బస్టర్స్ ఇచ్చి యూత్ లో విపరీతమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ వాళ్ళు క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేక పొయ్యారు, వారిలో ఒక్కరే అబ్బాస్, ఈయనకి అప్పట్లో ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో పుట్టిన అబ్బాస్‌ తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించి స్టార్‌ నటుడిగా మారాడు. తొంభైవ దశకంలో వచ్చిన అద్బుతమైన ప్రేమ కథ చిత్రం ‘ప్రేమ దేశం’తో నటుడిగా పరిచయయ్యాడు. తన హెయిర్‌ స్టైల్‌, స్కిన్‌ కలర్‌తో ఎంతోమంది లేడీ ఫ్యాన్స్‌ కలల రాకుమారుడిగా మారి లవర్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు.

అలా ఒకప్పుడు హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను అలరించిన నటుడు అబ్బాస్ కొన్నేళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు. చెప్పాలంటే అతడు కనుమరుగై దాదాపు పదేళ్లు అవుతుంది. ఇక అబ్బాస్ కూడా ఫిలిం బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన వాడే, ఈయన తాతగారు ఇనాయత్ హుస్సేన్ బాలీవుడ్ లో గొప్ప క్యారక్టర్ ఆర్టిస్ట్, ఈయన అప్పట్లో బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ , ధర్మేంద్ర, రిషి కపూర్ , సన్నీ డియోల్ వంటి ఎంతో మంది సూపర్ స్టార్స్ తో కలిసి నటించాడు,ఆయన సపోర్టు తోనే అబ్బాస్ సినిమాల్లోకి వచ్చాడు అనే సంగతి చాలా మందికి తెలియదు అనే చెప్పాలి, సాధారణంగా హీరోలు ఎవ్వరైనా 60 ఏళ్ళు వచ్చాక సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారు, కానీ అబ్బాస్ మాత్రం యుక్త వయసులో ఉన్నప్పుడే సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి న్యూజిలాండ్ లో స్థిరపడిపొయ్యాడు.

దీనితో పాటు అబ్బాస్ భార్య ఎవరా అని చాలా మందికి తెలీదు. ప్రముఖ బాలీవుడ్ నటి మరియు గొప్ప ఫాషన్ డిసైనర్ అయినా ఇరుము అలీ అనే అమ్మాయిని అబ్బాస్ పెళ్లి చేసుకున్నాడు. ఈమె బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది, అంతే కాకుండా అబ్బాస్ నటించిన ప్రతి సినిమాకి ఈమె ఫాషన్ డిసైనర్ గా చేసింది,పెళ్లి తర్వాత చాలా కాలం తర్వాత మీడియా కి దూరం గా ఉంటూ వస్తున్నా అబ్బాస్ తన ఫామిలీ తో కలిసి ఉన్న ఫోట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి.ఇక అబ్బాస్ కూతురు ఏమిరా అలీ ఫోటోలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే, చాలా మంది హీరోయిన్లు ఈమె అందం కి సరిపోరు అని చెప్పొచ్చు

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This