Saturday, June 19, 2021

అల్లు అర్జున్ తో ఉప్పెన డైరెక్ట‌ర్ కొత్త మూవీ?

Must Read

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆక‌ర్షించాడు డైరెక్ట‌ర్ బుచ్చిబాబు. సుకుమార్ ప‌ర్య‌వేక్ష‌ణ ఉన్నా…మొదటి మూవీ తోనే తన టాలెంట్ ఏంటో అందరికి చూపించాడు. చిన్న సినిమా అయినా 50కోట్ల‌కు పైగా బిజినెస్ చేసింది. దీంతో డైరెక్ట‌ర్ బుచ్చిబాబుకు ఫుల్ ఆఫ‌ర్స్ రాగా, మైత్రీ మూవీస్ లోనే సెకండ్ సినిమా చేసేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు.

అయితే NTR హీరోగా బుచ్చిబాబు సినిమా చేస్తార‌ని ఈ మధ్య వార్తలు వచ్చాయి.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ దానిపై క్లారిటీ రాక‌ముందే బుచ్చిబాబు బ‌న్నీతో మీట్ అవ్వడం ఫిలింన‌గ‌ర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఓ క‌థ‌పై వీరిద్దరు ఈ మ‌ధ్య త‌రచూ క‌లుస్తున్నార‌ని, చర్చలు జరుగుతున్నాయని మైత్రీ మూవీస్ లోనే ఈ సినిమా ఉండబోతుందని సమాచారం.

పుష్ప రెండు భాగాలుగా వ‌స్తుండ‌టం, వీటి మ‌ధ్య గ్యాప్ ఉండ‌టంతో… ఆ గ్యాప్ లో ఈ సినిమా ఉంటుందా అని రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, బ‌న్నీ కోసం ఇప్ప‌టికే బోయ‌పాటి, శ్రీ‌రామ్ వేణు వంటి ద‌ర్శ‌కులు వెయిటింగ్ లో ఉన్నారు. మరి చూడాలి డైరెక్టర్ బుచ్చి బాబు బన్నీతో సినిమా ఎప్పుడు డైరెక్ట్ చేస్తాడో అనేది,.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This