Tuesday, July 27, 2021

లైగర్ మూవీకి 200 కోట్ల ఓటీటీ ఆఫర్.. విజయ్ దేవరకొండ రియాక్షన్

Must Read

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న చిత్రం ‘లైగర్’ అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఒక వార్త ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తుంది. ఈ చిత్రానికి ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి ఫ్యాన్సీ ఆఫర్ వచ్చిందట. ఓటీటీ రిలీజ్‌తో పాటు అన్ని భాషల శాటిలైట్ రైట్స్ కోసం రూ. 200 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిందట.

అయితే ఈ పోస్ట్ విజయ్ దేవరకొండకు చేరడంతో తనదైన స్టైల్లో ట్విట్టర్ ద్వారా స్పందించారు. లైగర్ ఓటీటీ ఆఫర్ గురించి వచ్చిన పోస్ట్‌ను షేర్ చేస్తూ.. ‘ఈ ఆఫర్ చాలా చిన్నది. అంతేకాదు, నేను థియేటర్లలో ఇంకా ఎక్కువ కలెక్ట్ చేస్తాను’ అంటూ విజయ్ ట్వీట్ చేశాడు.

దీంతో పూరి-విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమాపై గట్టి నమ్మకంతోనే ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే ముంబైలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. హైదరాబాద్‌లో నెక్స్ట్ షెడ్యూల్ జరగబోతుంది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This