Tuesday, July 27, 2021

షాక్: నాగబాబు ఆరోగ్యానికి ఏమైంది?

Must Read

దేశంలో క‌రోనా మొద‌లైన‌ప్ప‌టి నుండి అనేక చేదువార్తలు వింటున్నాం. సామాన్యులు, సెల‌బ్రిటీలు అనే తేడా లేకుండా అంద‌రు క‌రోనాకు బ‌లైపోతున్నారు. కొంద‌రు అనారోగ్యంతో క‌న్నుమూస్తున్నారు. క‌రోనా స‌మ‌యంలో చాలా మంది లెజండ‌రీ న‌టులని ఇండ‌స్ట్రీ కోల్పోయింది. ఈ క్ర‌మంలో ఎప్పుడు ఏ విషాద వార్త వినాల్సి వ‌స్తుందోన‌ని అభిమానులు ఆందోళ‌న పడుతున్నారు.

సామజిక కార్యక్రమాలను నిర్వహించడంలో కష్టంలో ఉన్న బాధితులకు అండగా నిలబడడంలో ముందుటారు చిరంజీవి. తన అభిమానులను కలుపుకుని మెగా హీరోలు సామజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లు వంటి సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మంది బాధితులకు చిరంజీవి అండగా నిలిచారు.. ఇక కరోనా కష్ట కాలంలోనూ మెగాస్టార్ చిరంజీవి ప్రజలకు సాయం అందిస్తూనే ఉన్నారు.

తాజాగా TV ఆర్టిస్టులకు కూడా వాక్సిన్ అందించే కార్యక్రమం జరుగుతుంది. ఈ క్ర‌మంలో నాగ‌బాబు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై త‌న అన్న‌య్య‌, మెగాస్టార్ చిరంజీవికి కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేశాడు.అయితే వ్యాక్సిన్ డ్రైవ్ కోసం నాగ‌బాబు కారులో చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకుకి వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో కారు దిగేందుకు చాలా ఇబ్బంది ప‌డ్డారు. అలానే న‌డిచేట‌ప్పుడు చాలా క‌ష్టంగా నడిచారు. నాగ‌బాబుని ఇలా చూసి ఆయ‌న అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. నాగ‌బాబుకి ఏమైంది, ఇటీవ‌లి కాలంలో ఏమైన స‌ర్జరీ జ‌రిగిందా అంటూ అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This