Friday, July 30, 2021

వైద్యులు, రైతులు లోకల్-నాన్ లోకల్ అనుకుంటే పరిస్థితి ఏంటి? : హీరో సుమన్

Must Read

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు రోజురోజుకీ ఎన్నడూ లేనంతగా చర్చలకు తెరలేపుతున్నాయి. “మా” ఎన్నికలు సందర్బంగా నటుడు సుమన్ ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా అప్పుడే ‘మా’లో రచ్చ మొదలైంది. ఈ ఏడాది మొత్తం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నారు.

అయితే తాజాగా సీనియర్ నటుడు సుమన్ ‘మా’ ఎన్నికల వ్యవహారంపై స్పందించారు. లోకల్‌-నాన్‌లోకల్‌ అనే వ్యవహారం గురించి ప్రస్తావించడం అర్థరహితమని ఆయన అన్నారు. ఆ భావననే వైద్యులకు, రైతులకు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండంటూ కోరారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అమీర్‌పేటలోని అస్టర్‌ప్రైమ్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This