Saturday, June 19, 2021

ఇలియానాను బ్యాన్ చేసిన సినిపరిశ్రమ..! కారణం ఇదే..

Must Read

ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఇలియానాకు ప్రస్తుతం అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఇటు సౌత్ లోనూ, అటు నార్త్ లోనూ ఆమెకు అవకాశాలు లేవు. సౌత్ లో ఇల్లీ బేబీ కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ లో అడుగు పెట్టింది ఈ భామ. ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు చెయ్యడమే మానేసింది. అందుకే ఇలియానాకు దక్షిణాదిగా అవకాశాలు తగ్గిపోయాయని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ దాని వెనుక అసలు కారణం వేరే ఉందట.

ఈ విషయాన్ని తాజాగా ప్రముఖ దర్శక నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. “దేవుడు చేసిన మనుషులు” సినిమా చేస్తున్నప్పుడు ఇలియానాకు నటరాజు అనే తమిళ నిర్మాతకు మధ్య గొడవ జరిగిందంట. విక్రమ్ హీరోగా ‘నందం’ అనే సినిమాలో నటించడానికి ఒప్పుకున్న ఇలియానా ముందుగా అడ్వాన్స్ కూడా తీసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో ముందుగా అడ్వాన్స్ గా తీసుకున్న 40 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాలని నిర్మాత ఇలియానా ను అడిగారట. అయితే ఆమె అందుకు ఒప్పుకోలేదు.

దీంతో ఆయన తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసారు. ఈ విషయం అక్కడ కూడా పరిష్కారం కాకపోవడంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వద్దకు ఈ గొడవ వెళ్ళింది. అయితే ఆమె మీద అధికారికంగా బ్యాన్ విధించకుండానే అనధికారికంగా ఎవరు ఆమెను సౌత్ సినిమాలలోకి తీసుకోకూడదని నిర్ణయించారని తెలిపారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This