Friday, July 30, 2021

హీరో జ‌గ‌ప‌తిబాబు పాలిటిక్స్ లోకి వస్తారా?

Must Read

జగపతిబాబుది రీల్‌ లైఫ్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ కూడ వైవిధ్యమైన జీవితమే. తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటో వైరల్ గా మారింది. తెలుపు కుర్తా పైజామాలో ఉన్న జ‌గ‌ప‌తిబాబు చేతిలో బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని గోడ‌పై కూర్చున్న స్టిల్‌ను ట్విట‌ర్ పోస్ట్ చేశారు. ఆ ఫోటో ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది.

“మీరు ఫొటోలో చూడ్డానికి డైన‌మిక్ పొలిటిషియ‌న్ లా క‌నిపిస్తున్నారు. మీరు త్వ‌ర‌లో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారా..?” అని ఓ అభిమాని ప్ర‌శ్నించాడు. జ‌గ్గూభాయ్ రిప్లై ఇస్తూ.. ‘ఖ‌చ్చితంగా రాజకీయ నాయకుడిగా మాత్రం ఉండాలనుకోవడం లేదు’ అని బదులిచ్చారు. ఎన్నో సినిమాల్లో తన విలక్షణమైన నటనతో ఆకట్టుకున్న జగపతిబాబు ఇప్పుడు ఇంకా కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ‘టక్‌ జగదీష్‌’ ‘మహాసముద్రం’, ‘రిపబ్లిక్‌’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This