ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం జగన్ 4 పెద్ద శుభవార్తలు .. చూడకపోతే చాలా నష్టపోతారు

185

ఏపీలో జగన్ మార్కు పాలన కొనసాగుతుంది. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించి పాలనా పగ్గాలు చేపట్టిన వైసిపి దూకుడు చూపిస్తుంది. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ జగన్ పారదర్శక పాలనను అందించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు, రైతులకు, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే పనిలో ఉన్న జగన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొన్ని గుడ్ న్యూస్ లు చెప్పాడు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for jagan

ఇక మొదటి గుడ్ న్యూస్ విషయానికి వస్తే.. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు రూ.1355 ఇవ్వనున్నారు. 1 నుంచి 6 వ తరగతి చదివే గవర్నమెంట్ స్కూల్ లలో చదివే స్టూడెంట్స్ కోసం స్కూల్ బ్యాగ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, మూడు జతల యూనిఫార్మ్, ఒక జత షూస్, సాక్సులు..ఇలా అన్ని ఫ్రీగా ఇవ్వనున్నారు. దీనికోసం 1355 రూపాయలను ఇవ్వనున్నారు. విద్యార్థులకైతే 1 నుంచి 6వ తరగతుల వారికి నిక్కర్, షర్టు, బాలికలకు 1నుంచి 2వ తరగతుల వారికి ఫ్రాక్స్, 3నుంచి 6వరకు స్కర్టులు, షర్టు, పంజాబీ డ్రెస్సు, చున్నీ పంపిణీ చేస్తున్నారు. అయితే 7 నుంచి 8 తరగతుల వారికి మాత్రం యూనిఫాంలు పంపిణీ చేయడం లేదు. వచ్చే ఇయర్ నుంచి స్టూడెంట్స్ కు ఇవన్నీ అందేలా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించాడు. దీనికోసం రూ.34.31 కోట్లు ఖర్చుచేయనుంది ప్రభుత్వం.

ఇక రెండవ గుడ్ న్యూస్ ఏమిటంటే.. ఇంటికే పెన్షన్. రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులకు ప్రతినెలా తొలిరోజే ఇంటికే పెన్షన్‌ చేరాలని సీఎం జగన్ నిర్ణయించారు. రాష్టంలో అన్నిచోట్లా గ్రామ వాలంటీర్లు లబ్ధిదారులకే ఇళ్లకే వెళ్లి పింఛన్‌ అందజేస్తున్నారు. వృద్ధులు, మంచం పట్టిన వ్యాధిగ్రస్తులు, కనీసం కదల్లేని స్థితిలో వున్న దివ్యాంగులు… గతంలో పెన్షన్‌ తీసుకోవడానికి స్వయంగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేంది. సీఎం జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు వారున్న చోటికే పెన్షన్‌ తీసుకురానున్నారు.

Image result for jagan

ఇక మూడవ గుడ్ న్యూస్ ఏమిటంటే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రజకులు, టైలర్లు, నాయీబ్రాహ్మణులకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించేందుకు ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం లబ్ధిదారుల సెలెక్షన్ ప్రాసెస్ ను ప్రారంభించింది. ఆయా వృత్తులు నిర్వహిస్తున్న లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోవాలని బీసీ ఆర్థిక సహకారం సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. లబ్ధిదారులు ఆధార్‌ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, తెల్ల రేషన్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, అలాగే మీకు టైలర్ షాప్ గానీ, ఏదైనా షాప్ ఉన్నా గానీ దానికి సంబందించిన డాక్యుమెంట్స్ ఉండాలి. ఇప్పటికే అప్లై చేసుకున్నవారికి త్వరలోనే అకౌంట్ లో 10 వేల రూపాయలు పడనున్నాయి.

ఇక నాల్గవ గుడ్ న్యూస్ ఏమిటంటే.. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీలు, బాలింతలు, రెండేళ్ల లోపు పిల్లలు ఉన్న కుటుంబాలకు కోడిపెట్టలు అందజేస్తారు. వీటితో పనిచెయ్యలేనటువంటి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని ప్రభుత్వం కోడిపెట్టలను ఇవ్వనుంది. మహిళా సంఘాలలో ఉన్నవారికి ఈ కోడిపెట్టలను అందజేస్తారు.

ఇవేనండి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన 4 గుడ్ న్యూస్ లు. మరి జగన్ చెప్పిన ఈ గుడ్ న్యూస్ ల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation