ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి… లేటు వ‌య‌స్సులో ఘాటు ప్రేమ..

61

ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్…పేరు చెప్పగానే అందరికీ ముందు గుర్తొచ్చేది ఆయన చేసే సర్వేలు. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే చల్లి సంచలనం సృష్టించిన విషయం. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నా కూడా, సర్వేలు చెయ్యడం మానడం లేదు. అయితే ఇదంతా ఆయన పోలిటికల్ కెరీర్ పరంగా జరిగిన సంఘటనలు. కానీ ఆయన పర్సనల్ లైఫ్ పరంగా కూడా ఆయన కొన్ని సంచలనాలే సృష్టించాడు. అది కూడా పెళ్లి విషయంలో ఆయన జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికి కూడా చాలామందికి లగడపాటికి రెండు పెళ్లిళ్లు జరిగాయని తెలీదు. మరి అయన రెండో పెళ్లి గురించి, దాని వెనుక ఉన్న ట్విస్ట్ ల గురించి తెలుసుకుందామా..

Image result for lagadapati second wife

లగడపాటి మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర కూతురు పద్మను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయితే లగడపాటి ఎప్పుడైతే ఎంపీగా గెలిచారో అప్పటి నుంచి ఆయనకు ఓ డాక్టర్ మీద ప్రేమ పుట్టింది. అది కూడా భర్తకు విడాకులు ఇచ్చిన డాక్టర్ ఆమె. అయితే లేటు వయసులో ఘాటు ప్రేమ రావడంతో, లగడపాటి ఆమెని రెండో వివాహం చేసుకున్నాడు. కాకపోతే ఈ విషయం గురించి ఎవరికి పెద్దగా తెలియదనే అనుకోవాలి. ఆయన రెండో పెళ్లి చేసుకున్న విషయం అధికారికంగా ఎక్కడ బయటకు రాలేదు. అయితే 2009 ఎన్నికల అఫడవిట్‌ లో అసలు విషయం బయటకొచ్చింది. 2004లో తనకు ఇద్దరు కుమారులు మాత్రమేనని ఎన్నికల అఫిడవిట్లో తెలియజేసిన ఆయన, 2009లో సమర్పించిన అఫిడవిట్లో మాత్రం తనకు ముగ్గురు కూమారులని చెప్పారు. మూడో కుమారుడి పేరు ఎల్.హర్మన్ అని పేర్కొన్నారు. దాంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది.

Image result for lagadapati second wife

దీంతో ల‌గ‌డ‌పాటికి రెండో పెళ్లి జ‌రిగింద‌ని, వారికి కుమారుడు కూడా జ‌న్మించాడ‌ని మైల‌వ‌రానికి చెందిన అడ్వకేట్ సుంక‌ర కృష్ణమూర్తి గతంలో రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ఫిర్యాదు చేశారు. ల‌గ‌డ‌పాటి జానకి అనే యువ‌తిని రాజ‌గోపాల్ రెండో వివాహం చేసుకున్నార‌న్న లాయ‌ర్, వారి కుమారుడే హ‌ర్మోన్ అని పేర్కొన్నారు. రాజ‌గోపాల్, జాన‌కి దండ‌లు మార్చుకున్న ఫోటోను కూడా ఆయ‌న స‌మ‌ర్పించారు. దీంతో లగడపాటి రెండో పెళ్లి గురించి అందరికి తెలిసింది. మొత్తానికి ఈ విధంగా లగడపాటి లేటు వయసులో మరో పెళ్లి చేసుకునే సంచలనమే సృష్టించారు. ఇదిలా ఉంటే లగడపాటి 2014లో రాజకీయాల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక రాజకీయాల నుంచి తప్పుకున్న ఆయన సర్వేలు చేయడం మాత్రం ఆపలేదు. అయితే 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో, 2019 ఏపీ ఎన్నికల్లో ఆయన సర్వేలు విఫలం కావడంతో, మళ్ళీ ఆయన మీడియా ముందు కనిపించలేదు. మళ్ళి 2024 ఎన్నికల సమయంలో వస్తాడేమో చూడాలి.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation