ఇండియా జోలికొస్తే పాకిస్తాన్ మ్యాప్ లో కనిపించదు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 36 గంటల పర్యటన కోసం భారత్‌కు చేరుకున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ట్రంప్ విమానం ల్యాండ్ అయింది. ముందుగా ట్రంప్ బృందం విమానం నుంచి బయటకు వచ్చింది. అనంతరం ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ విమానం దిగారు. ప్రధాని మోడీ ఇవాంకాకు స్వాగతం పలికారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లు ఎయిర్‌ఫోర్స్‌ వన్ నుంచి బయటకు దిగారు. ట్రంప్‌కు మోడీ ఘన స్వాగతం పలికారు. ఇరునేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. విమానాశ్రయం నుంచి ట్రంప్ తన కాన్వాయ్‌లో సబర్మతి ఆశ్రమంకు వెళ్లారు. అక్కడి నుంచి ట్రంప్ మోడీలు మొతేరా స్టేడియంకు చేరుకున్నారు.. అక్కడే నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రంప్ దంపతులతో పాటు ప్రధాని మోడీ కూడా ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 1.25 లక్షల మంది హాజరయ్యారని అంచనా.

ఇక ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఇక నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ఇచ్చిన ప్రసంగంలో ట్రంప్ ఉగ్రవాదం మీద మాట్లాడాడు. ఉగ్ర‌వాదాన్ని నిలువ‌రించేందుకు అమెరికా, భార‌త్ క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయ‌నున్న‌ట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఉగ్ర‌వాద భావ‌జాలానికి వ్య‌తిరేకంగా త‌మ దేశం పోరాటం చేస్తున్న‌ట్లు చెప్పారు. తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. పాకిస్థాన్‌ను క‌ట్ట‌డి చేశామ‌న్నారు. ఉగ్ర కార్య‌క‌లాపాల‌ను పాక్ త‌గ్గించే విధంగా చూశామ‌న్నారు. బోర్డ‌ర్‌ లో ఆప‌రేట్ చేస్తున్న మిలిటెంట్ల‌ను అదుపు చేయాల‌ని పాక్‌ను హెచ్చ‌రించిన‌ట్లు చెప్పారు. ఐసిస్ ను అణచివేసాం అని ఈ సందర్భంగా గుర్తుచేశాడు. ప్ర‌స్తుతం పాకిస్థాన్‌తో మంచి సంబంధ‌మే ఉంద‌న్నారు. పాకిస్థాన్‌తో సంబంధాల‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తున్న‌ట్లు తెలిపారు. పాక్‌, భార‌త్ మ‌ధ్య ఉత్కంఠ ప‌రిస్థితి త‌గ్గుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. స్థిర‌త్వం సాధిస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. దీంతో ద‌క్షిణాసియాలో శాంతి విక‌సిస్తుంద‌న్న భావాన్ని ట్రంప్ వినిపించారు. ఒకవేళ పాకిస్తాన్ మా మాటను పెడచెవిన పెడితే సహించేది లేదని, అలా చేస్తే పాకిస్తాన్ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ట్రంప్ చెప్పారు.

Image result for trump speech

ఇండియా చేప‌ట్టిన చంద్ర‌యాన్ ప్రోగ్రామ్‌ ను ట్రంప్ కీర్తించారు. అంత‌రిక్ష స‌హ‌కారాన్ని అందించేందుకు తాము ఆస‌క్తిగా ఉన్నామ‌ని ట్రంప్ అన్నారు. ఇక భారితీయ సినిమాలు అయినా దిల్‌వాలే దుల్హానియా లే జయేంగే, షోలే సినిమాల గురించి ప్రస్తావించాడు. తన ప్రసంగంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్లను కూడా ప్రస్తావించాడు.. భారతదేశం భవిష్యత్తులో ఓ స్థాయికి ఎదగబోతోంది. ఇతర ప్రపంచదేశాలు కూడా దీని అభివృద్ధిని ఊహించడం కష్టమే. ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. రెండు దేశాల మధ్య 40శాతంకు పైగా వాణిజ్యం జరుగుతోంది. భారత్ అమెరికాల మధ్య గొప్ప వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాం. గాడ్ బ్లెస్ ఇండియా, గాడ్ బ్లెస్ యూఎస్ఏ, వీ ల‌వ్ యూ, ఇండియా అంటూ త‌న ప్ర‌సంగాన్ని ట్రంప్ ముగించారు. నమస్తే ట్రంప్ కార్యక్రమం తర్వాత డొనాల్డ్ ట్రంప్ దంపతులు ఆగ్రా లోని తాజ్‌మహల్‌ ను సందర్శించడానికి బయలుదేరారు. అనంతరం ఢిల్లీకి చేరుకుని ఫిబ్రవరి 25వ తేదీన రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు, పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరి వెళతారు ట్రంప్.

Content above bottom navigation