ఎలక్షన్ కమిషన్ మరొక సంచలన నిర్ణయం.. జగన్ కు దెబ్బ మీద దెబ్బ ..

80

కరోనా వైరస్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్ ప్రకటించారు. ఆరు వారాల పాటు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఇప్పటికే జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు హాజరుకానున్నారు. మనం పేపర్ బ్యాలెట్స్ వాడుతున్న నేపథ్యంలో, అధిక సమయం పడుతుంది. మనుషులకు మనుషులు తగిలే అవకాశం ఎక్కువ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ముప్పు తప్పడం లేదు. ఎన్నికలు జరపడం ముఖ్యమైనా, ప్రజాభద్రతను పణంగా పెట్టకూడదనే వాదనతో ఎన్నికల కమిషన్ ఏకీభవిస్తుంది. కానీ, ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగానో, పాక్షికంగానో పూర్తయ్యాయి. అనేక వ్యయ ప్రయాసలను అధిగమించి ఏర్పాట్లు చేపట్టాం. సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు చేశాం.

కానీ, విధిలేని పరిస్థితుల్లో ప్రస్తుతం నెలకొన్న వాతావరణంలో రాజ్యాంగం ద్వారా, పంచాయతీ రాజ్ చట్టం ద్వారా సంక్రమించిన విస్త్రత, విచక్షణ అధికారాల మేరకు ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు నిలిపివేస్తున్నాం. ఇది కేవలం నిలిపివేత మాత్రమే. రద్దు కాదు. ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ రద్దు కాదు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారు. ఆరు వారాల తర్వాత సమీక్ష తర్వాత వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. జెడ్పీపీ, ఎంపీపీ, మున్సిపాలిటీలకు ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లు అవసరమైన మేరకు సవరిస్తాం. పంచాయతీ ఎన్నికలకు ఆరు వారాల తర్వాత సరికొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తాం.’ అని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు.

రమేష్ ఇలా ప్రకటించగానే ఏపీ సీఎం జగన్ రమేష్ పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రమేష్ టీడీపీ పార్టీకి సంబందించినవాడు, అందుకే ఎన్నికలు వాయిదా వేశాడని వైసిపి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎన్నికలను వాయిదా వేయడాన్ని జగన్ తప్పుపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై జగన్ విరుచుకుపడ్డారు. ఎన్నికలను ఈసీ వాయిదా వేయడంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసీ తీరుని జగన్ తప్పుపట్టారు. ఈసీ రమేష్ కుమార్ విచక్షణ కోలోపోయారని, ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రమేశ్‌కుమార్‌, చంద్రబాబుది ఒకే సామాజికవర్గం అన్న జగన్.. చంద్రబాబు హయాంలోనే రమేష్ కుమార్ నియమితులయ్యారని గుర్తు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిష్పాక్షికంగా ప్రవర్తించడం లేదన్నారు జగన్‌. కరోనా వైరస్‌ సాకుతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన ఈసీ రమేశ్‌కుమార్‌.. చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల బదిలీకి ఆదేశాలు ఇవ్వడాన్ని జగన్‌ తప్పుపట్టారు. విచక్షణాధికారం పేరుతో ఎన్నికలు వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఈసీకి ఎక్కడ ఉందని జగన్‌ ప్రశ్నించారు. ఎవరినీ సంప్రదించకుండానే, ఎవరి సలహాలు తీసుకోకుండానే రమేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని జగన్ సీరియస్ అయ్యారు. చంద్రబాబు కోసమే ఈసీ ఎన్నికలు వాయిదా వేశారని జగన్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి ఎక్కడుందని జగన్ నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనే భయంతోనే విచక్షణ అధికారాల పేరుతో ఎన్నికలు వాయిదా వేశారని ఆరోపించారు సీఎం జగన్‌. విచక్షణ అధికారాల పేరుతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుంటే తాము అధికారంలో ఉండి ఉపయోగం ఏంటని జగన్ ప్రశ్నించారు. ఇక సీఎంగా నేనెందుకు అని జగన్ నిలదీశారు. ఎన్నికల కమిషనరే సీఎంగా పని చేయొచ్చు కదా? అన్నారు. అసలు రాష్ట్రంలో ఎన్నికలు ఎందుకు, ప్రభుత్వం ఎందుకు అని అడిగారు.

Image result for ఎలక్షన్ కమిషన్ మరొక సంచలన నిర్ణయం..

మరొకవైపు టీడీపీ, బిజెపి, జనసేన నేతలు స్థానిక ఎన్నికలను రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాయి. దానికి కారణాలు లేకపోలేదు. స్థానిక ఎన్నికలో నిలబడ్డ ఇతర పార్టీల వాళ్ళను వైసిపి నేతలు బెదిరించడం జరుగుతుంది. నామినేషన్ ను రద్దు చేసుకోకపోతే రౌడీయిజం చేస్తున్నారు. అందుకే చాలామంది వేరే పార్టీల వాళ్ళు నామినేషన్స్ వెనక్కి తీసుకుంటున్నారు. కొందరు మాట వినకపోతే వాళ్ళ ఇంటి ముందు మందు సీసాలు పెట్టి కేసులు వేస్తున్నారు. ఇవి వైసిపి పార్టీల వాళ్ళు ఆ మందు సీసాలను పెట్టిన సిసి ఫుటేజ్ దొరికినా కూడా పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదు. అందుకే టీడీపీ, బిజెపి, జనసేన నేతలు స్థానిక ఎన్నికలను రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాయి. వీటిని పరిశీలనగా తీసుకుని ఎన్నికలు రద్దు చేసే ఆలోచనలో ఎలక్షన్ కమిషన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే జగన్ కు మరొక పెద్ద షాక్ అనే చెప్పాలి.

Content above bottom navigation