ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఏం జ‌రిగింది? 10 మందికి క‌రోనా 80 మందిలో టెన్ష‌న్

176

సైలెంట్ గా క‌రోనా త‌న ప్ర‌తాపం చూపుతూ వైలెంట్ గా మారుతోంది
కేవ‌లం ప‌ది రోజుల్లో దేశంలో 170 కేసులు న‌మోదు అయ్యాయి
దేశంలో క‌రోనా పాజిటీవ్ కేసులు సంఖ్య యావ‌రేజ్ గా ఇర‌వై ఉంటోంది
ఇక్కడ మన దేశంలో వారికంటే ఇత‌ర దేశాల నుంచి ఇక్క‌డ‌కు వచ్చే టూరిస్టుల వ‌ల్ల మ‌న‌కు పాజిటీవ్ కేసులు పెరిగాయి
తాజాగా ఓ ఎక్స్ ప్రెస్ లో ప్ర‌యాణించిన ప‌ది మంది వ‌ల్ల , ఇప్పుడు ఆ బోగి క‌రోనా ఎఫెక్ట్ తో బాధ‌ఫ‌డుతోంది
ఇంత‌కీ ఆరోజు ఏమైంది అనేది చూద్దాం

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు బులెటిన్ విడుదల చేసింది. తాజా బులెటిన్‌ బట్టి చూస్తే ఒకే రోజులో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాలో సంచరించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందనే వార్త అందరిలోనూ మరింత ఆందోళన కలిగిస్తోంది. పైగా అతడు ఢిల్లీ నుంచి రైలులో బయల్దేరి రామగుండం చేరుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అతడు ప్రయాణించిన రైలులో ఇంకా ఎవరికైనా వైరస్ సోకిందా అనే అనుమానం అధికార యంత్రాంగాన్ని కూడా ఆందోళనకు గురిచేస్తోంది.

post a man who traveled from delhi to ramagundam in train tested with corona positive, ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో కరోనా పేషెంట్ !

ఇటీవల ఇండోనేషియా నుంచి 11 మంది బృందం ఇటీవలే ఇండియాకు వచ్చింది. వారిలో 10 మంది కరీంనగర్‌ జిల్లా రామగుండం వెళ్లినట్లుగా తెలుస్తోంది. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైరస్ సోకిన వ్యక్తి మార్చి 14 వ తేదీన ఢిల్లీ నుంచి ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో ఎస్ 9 బోగీలో బయలుదేరి మరుసటి రోజున రామగుండంలో దిగిపోయారు. అయితే, రామగుండం వచ్చిన తరువాత సదరు వ్యక్తికి దగ్గు, జలుబు పట్టుకున్నాయి. అతనికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మార్చి 15 వ తేదీన ఎస్ 9 బోగీలో ప్రయాణం చేసిన వ్యక్తుల వివరాలు కావాలని రైల్వే శాఖకు వైద్యశాఖ లేఖ రాసింది. మార్చి 17 వ తేదీన ఈ లేఖ రాసింది.

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

ఇండోనేసియా నుంచి కరీంనగర్‌ వచ్చిన 10 మంది బృందం ప్రయాణించిన రైలు బోగీలో 82 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 8 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. వారు ప్రయాణించిన రైలుతో పాటు, ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరిని కలిశారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా వారి వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు రైల్వే అధికారులు అందించారు. వారికి కాల్ చేసి వైద్యులు టెస్ట్ చేయించుకోవాలి అని చెబుతున్నారు, దీనిని అధికారులు ఈరోజు పూర్తి చేసి, దాని పూర్తి అప్ డేట్ ప్ర‌భుత్వానికి ఇవ్వ‌నున్నార‌ట‌.

Content above bottom navigation