కవితకు రాజ్యసభ కాదు అంతకు మించిన పదవి ఇవ్వనున్న సీఎం కేసీఆర్

105

కేసీఆర్ రాజ‌కీయ ఉద్దండుడు.. ఎప్పుడు ఎలాంటి ఎత్తులు వేస్తారో సులువుగా చెప్ప‌లేము.
తన ఆలోచ‌న‌ల‌తో రాజ‌కీయ చాణిక్య‌త‌లో ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు
పార్టీకి క‌మిట్మెంట్ తో ప‌ని చేసే వారిని గుర్తించ‌డంలో కేసీఆర్ ముందు ఉంటారు
కుటుంబం కులం ఇలాంటి వాటికి పార్టీలో కేసీఆర్ ఏ నాడు ప్ర‌యారిటీ ఇవ్వ‌రు
ఉద్య‌మం నుంచి త‌న వెంట న‌డిచిన వారికి- ప్ర‌జ‌ల్లో గుర్తింపు ఉన్న‌వారికి ప‌ద‌వులు ఇచ్చారు
అయితే అందరూ ఊహించింది కేసీఆర్ చేస్తే ఇక ఆయ‌న స్పెషాలిటీ ఏముంది
అందుకే త‌న‌దైన మార్క్ పొలిటిక‌ల్ స్ట‌యిల్ చూపిస్తున్నారు
అంద‌రూ కూడా నిజామాబాద్ మాజీ ఎంపీ క‌విత‌కు రాజ్య‌స‌భ సీటు వ‌స్తుంది అనుకున్నారు
కాని చివ‌రి నిమిషంలో కేకే – సురేష్ రెడ్డిల‌కు ప‌ద‌వి వ‌చ్చింది
అయితే క‌విత‌కు ఏ ప‌ద‌వి ఇవ్వాల‌ని గులాబీ బాస్ ఆలోచిస్తున్నారు
ఏమా క‌థ ఈ స్టోరీలో చూద్దాం.

తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాల్లో కేసీఆర్ కుమార్తె – మాజీ ఎంపీ కవితకు ఒక స్థానం ఇస్తారని సర్వత్రా ప్రచారం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి నుంచి కవిత రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు. ఈ సమయంలో రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో కవితను కేసీఆర్ ఎంపీగా చేస్తారని పార్టీ వర్గాలతో పాటు ప్రజలు కూడా భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాజ్యసభకు పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న కె.కేశవరావు – మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. దీంతో కవితకు అవకాశం రాలేదు.

Image result for kavitha

అయితే కవిత రీ ఎంట్రీ గురించి కేసీఆర్ బాగా ప్లాన్ చేస్తున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి.. ఆమెను ఈసారి రాష్ట్రంలో పార్టీకి సేవ చేసేలా ప్ర‌భుత్వంలో భాగం అయ్యేలా ప‌ద‌వి ఇవ్వ‌నున్నార‌ట‌… గతంలో నిజమాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో ఉన్నారు క‌విత‌… ఇప్పుడు రాష్ట్రానికి ఆమెను పరిమితం చేయాలని నిర్ణయించారట. ఆమెకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని చూస్తున్నారట గులాబీ బాస్ కేసీఆర్

2019 లోక్ సభ ఎన్నికల్లో ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ నుంచే కవిత పోటీ చేసి ఘోరంగా ఓటమి చెందారు. ఇది ప్రజలందరికీ ఆశ్చర్యపరిచింది. పైగా బీజేపీ చేతిలో ఓడిపోవడంతో టీఆర్ ఎస్ తో పాటు అందరూ ఖంగుతిన్నారు. ఆమె ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. ఆడపిల్లను ఒంటరిగా చేసి బీజేపీ – కాంగ్రెస్ కుట్రతో ఓడించారని కేసీఆర్ మనసులో నాటుకుపోయింది. దాంతోనే కవిత కలత చెంది రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

కవితను మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకు వచ్చేలా టీఆర్ ఎస్ అధినేత – ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారట. ఆమె ఓటమితో కేసీఆర్ కొంత ఆలోచించారు. ఎప్పటి నుంచో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం సాగుతోంది.. అయితే అది వాస్తవమే. కాకపోతే ఈరోజు కాకపోతే రేపు ఉంటుంది కానీ కేటీఆర్ మాత్రం పక్కా సీఎం అవుతారనేది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

ఈ క్రమంలో కేటీఆర్ కు తోడుగా కవితను ఉండేలా కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకునేట్టు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఉన్నాయి. ఆ రెండింట్లో ఒక స్థానం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కవితను మంత్రివర్గంలోకి తీసుకువచ్చి ఇతరులకు చెక్ పెట్టేందుకు కూడా కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు. ఇదే జరిగితే త్వరలోనే తండ్రి ముఖ్యమంత్రి – మంత్రులుగా కేటీఆర్ – కవిత ఉంటే ఆ మంత్రివర్గం ప్రత్యేకత సంతరించుకునే అవకాశం ఉంది. ఇలాంటి ప‌రిణామం త్వ‌ర‌లోనే చూస్తాం అంటున్నారు గులాబీ నేత‌లు.

Content above bottom navigation