కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ చూసి మురిసిపోయిన ట్రంప్ మెలానియా ఏమిచ్చారంటే

177

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటిస్తోన్న నేపథ్యంలో ఆయన గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ విందు ఇస్తున్నారు. ఈ క్రమంలో విందుకు హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ట్రంప్‌ షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. సూటు బూటు వేసుకుని ఈ విందుకు కేసీఆర్‌ హాజరయ్యారు.

ఈ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. విందుకు హాజరైన ప్రతినిధులను ట్రంప్ దంపతులకు రామ్‌నాథ్‌ కోవింద్ పరిచయం చేశారు. త్రివిద దళాధిపతులు, పలువురు ఉన్నతాధికారులు కూడా విందుకు వచ్చారు. అమెరికా బృందాన్ని రాష్ట్రపతి కోవింద్‌కు ట్రంప్ పరిచయం చేశారు. వ‌రుస‌గా నేత‌లు అంద‌రితో స‌మావేశం అయ్యారు ట్రంప్, ఈ స‌మ‌యంలో భార‌త ప‌ర్య‌ట‌న త‌న‌కు ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపారు ట్రంప్.

Image result for kcr trump

 వరుసగా నేతలను కలుస్తూ వచ్చిన ట్రంప్.. కేసీఆర్ కు కరచాలనం చేసి, కొన్ని క్షణాలు మాట్లాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్  సదస్సు విషయాన్ని ప్రస్తావించారు. తన కుమార్తె ఇవాంకా హాజరైన ఆ సదస్సుకు తెలంగాణ ఇచ్చిన ఆతిథ్యం భేష్ అని అభినందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్పందిస్తూ.. సదస్సుకు మీరు కూడా హాజరవుతారని భావించామని చెప్పారు. ఇవాంకా వచ్చి అందరినీ ఆకట్టుకున్నారని చెప్పారు. దీంతో తాను సదస్సుకు రావాలనుకున్నా వీలుకాలేదని ట్రంప్ పేర్కొన్నట్టు తెలుస్తోంది.

ఢిల్లీ విందు సందర్భంగా సీఎం కేసీఆర్ కరీంనగర్ కు చెందిన కళాకారులు తయారు చేసిన వెండి ఫిలిగ్రీ కళాకృతులను ట్రంప్ కు బహూకరించారు. ఇందులో చార్మినార్, నెమలి, కాకతీయ కళాతోరణం, వీణ వంటి ఆకృతులు ఉన్నాయి. ఇక ట్రంప్ సతీమణి మెలనియాకు ఎర్ర రంగు పోచంపల్లి పట్టుచీరను బహూకరించినట్టు తెలుస్తోంది… మొత్తానికి కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ట్రంప్ దంప‌తుల‌కి బాగా న‌చ్చింది అని చెప్పార‌ట‌. అయితే కేసీఆర్ కు ఆహ్వ‌నం వ‌చ్చిన త‌ర్వాత మాత్రమే ఈ గిఫ్ట్ త‌యారు చేయించార‌ట‌, అప్ప‌టి వ‌ర‌కూ ఆహ్వ‌నం అంద‌లేదు కాబ‌ట్టి కేవ‌లం వారం ముందు మాత్ర‌మే ఈ గిఫ్ట్ స్పెష‌ల్ గా త‌యారు చేయించారు అని తెలుస్తోంది.

Content above bottom navigation