గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు దిమ్మతిరిగే న్యూస్ చెప్పిన జగన్…

100

మీరు గ్రామ, వార్డు సచివాలయంలో ఉద్యోగా?.. మీకు అంతకన్నా మెరుగైన ఉద్యోగం వచ్చిందని రాజీనామా చేయాలనుకుంటున్నారా?.. అయితే మీకోక షాకింగ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు దిమ్మతిరిగే న్యూస్ చెప్పింది. మీరు గ్రామ, వర్డ్ సచివాలయ ఉద్యోగాలకు రాజీనామా చెయ్యాలంటే, కేవలం రాజీనామా లేఖ ఇచ్చిపోతే సరిపోదు. ఇప్పటిదాకా మీకు శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం చేసిన ఖర్చు, తీసుకున్న వేతనాల్ని తిరిగి చెల్లిస్తేనే రాజీనామాను ఆమోదిస్తారు. లేదంటే మీకొచ్చిన మెరుగైన ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందే.

గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.10 లక్షలకుపైగా ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. నిర్వహించాల్సిన బాధ్యతలపై అవగాహన కల్పిస్తూ వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. సచివాలయాల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారిలో ఎక్కువమంది పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పీజీ), ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన వారితోపాటు ఇతర పోటీ పరీక్షలకు అప్పటికే హాజరైన వారు, పరీక్షలు రాసేందుకు సిద్ధమైన వారే ఉన్నారు. వీరిలో కొందరు మెరుగైన ఉద్యోగాలకు ఇప్పుడిప్పుడే ఎంపికవుతున్నారు. ఇలాంటి వారంతా ఇప్పుడు రాజీనామా చెయ్యాలని అనుకుంటున్నారు. అయితే గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు, ఇంకా మెరుగైన ఉద్యోగానికి ఎంపికైతే, శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం చేసిన ఖర్చు, తీసుకున్న వేతనాలను తిరిగి చెల్లిస్తే మాత్రమే అధికారులు రాజీనామాను ఆమోదిస్తారు. లేదంటే మాత్రం సచివాలయ ఉద్యోగులు మెరుగైన ఉద్యోగాన్ని వదులుకోక తప్పదు. ప్రభుత్వం 2019 సంవత్సరం ఆగష్టు నెలలో 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష ఫలితాల అనంతరం మెరిట్ జాబితా ఆధారంగా 1,10,000 ఉద్యోగులను నియమించింది. గ్రామ, వార్డ్ సచివాలయాలలో నిర్వహించాల్సిన బాధ్యతల గురించి వీరికి శిక్షణ ఇచ్చింది. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో కొందరు ఇతర పోటీ పరీక్షలు రాసి మెరుగైన ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. ఇతర ఉద్యోగాలకు ఎంపికయిన వారు రాజీనామా చేసి బయటకు వెళ్లాలంటే మూడు నెలల వేతనాన్ని, ప్రభుత్వం శిక్షణ కోసం చేసిన ఖర్చును తిరిగి చెల్లించాలని అధికారులు చెబుతూ ఉండటంతో ఉద్యోగాలకు ఎంపికైనవారు ఆందోళన చెందుతున్నారు.

సీఎం జగన్ కు షాక్... రాజీనామా చేస్తున్న గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు..?

అనంతపురం జిల్లాలోని సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన ఒక ఉద్యోగికి రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఫిబ్రవరి 6వ తేదీన తనకు రైల్వేలో ఉద్యోగం వచ్చిందని, ఆ వ్యక్తి డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అధికారులు ఆ వ్యక్తికి 57,095 రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేసిన తరువాత మాత్రమే రాజీనామా ఆమోదం తెలుపుతామని చెప్పినట్టు సమాచారం. ఇక, విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కొత్తబగ్గం, గంట్యాడ మండలం కొర్లాం గ్రామ సచివాలయాల్లో ఇద్దరు డిజిటల్ అసిస్టెంట్లు.. మెరుగైన ఉద్యోగాలు వచ్చాయని రాజీనామాలు చేశారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత ఎంపీడీవోలకు లేఖ రాస్తూ.. ఉద్యోగానికి రాజీనామాలు చేసిన ఇద్దరూ ఇప్పటిదాకా తీసుకున్న జీతభత్యాలు, ఇతర అలవెన్సులు సంబంధిత శాఖలకు జమ చేసిన తరువాత మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు రాజీనామా చేస్తే జీత భత్యాలు, ఆలవెన్సులు తిరిగి ఇవ్వాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నా అమలుకు సంబంధించి ప్రభుత్వం నుండి అధికారులకు ఆదేశాలు రాలేదు. ఆదేశాలు లేకుండానే జీత భత్యాలు, ఆలవెన్సులు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Content above bottom navigation