చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాక్ : స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ?

111

ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.దానికి కారణం కరోనా వైరస్. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేశాడు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్. అయితే ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ నేతలు హ్యాపీగా ఉంటె, వైసిపి నేతలు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు అనుకున్న సమయానికే నిర్వహించాలని పట్టుబడుతున్నారు. అయితే ఇప్పుడు ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

కరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. దీని దెబ్బకు అన్నిదేశాలు విల విల్లాడుతున్నాయి. వ్యాధి మరింతగా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇండియా కూడా కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది. అదిగో అలా ప్రకటించినందువల్లే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆరు వారాలపాటు వాయిదా వేశారు. అయితే రమేశ్ కుమార్ నిర్ణయం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక.. మరో పది రోజుల్లో పూర్తవుతుందనగా.. ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడాన్ని సీఎం జగన్ తో పాటు పలువురు వైసీపీ నాయకులు తీవ్రంగా ఖడించారు.

ఏపీలో కేవలం ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కనీసం ఒక్క మరణం కూడా లేదు. కానీ ఫ్రాన్స్ లో ఏకంగా కరోనా కారణంగా 90 మందికి పైగా మరణించారు. కరోనా వైరస్ తో సతమతమవుతున్న ప్రాన్స్ లో మాత్రం స్థానిక ఎన్నికలు యధావిధిగా జరిగాయి. ఫ్రాన్స్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కరోనాతో ఆ దేశంలో ఇప్పటి వరకు 91మంది మరణించారు. మరో 2,900 మంది కరోనా బారిన పడ్డారు. ఈ ఎన్నికల సందర్భంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఫ్రాన్స్ లో కరోనా సృష్టించిన సంక్షోభం మొదటి దశలోనే ఉన్నామన్నారు. ఆదివారం నుంచి దేశంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను యథావిధిగా నిర్వహిస్తామని మెక్రాన్ ప్రకటించారు. ఇప్పుడు ఇదే నిర్ణయాన్ని ఏపీలో కూడా అమలుచేయాలని వైసిపి నేతలు అంటున్నారు.

Image result for స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ?

అలాగే ఎన్నికల కమిషన్ మీద వైసిపి నేతలు సుప్రీంకోర్టు కు వెళ్లారు. కరోనా లేని ఏపీలో ఎన్నికలు వాయిదా వెయ్యడం సబబు కాదని వైసిపి నేతలు కోర్ట్ లో పిటిషన్ వేశారు. వెంటనే ఈ విషయంలో కల్పించుకుని ఏపీలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోర్ట్ ను కోరింది. వాళ్ళు వేసిన పిటిషన్ లో ఫ్రాన్స్ ఎన్నికల కూడా ప్రస్తావించారు. కరోనా తీవ్రంగా ఉన్న ఫ్రాన్స్ లోనే ఎన్నికలు నిర్వహించినప్పుడు, కరోనా లేని ఏపీలో ఎందుకు నిర్వహించకూడదు అని వైసిపి కోర్ట్ ను ఆశ్రయించింది. దీనిపై రెండ్రోజుల్లో కోర్ట్ తీర్పు ఇవ్వనుంది. ఒకవేళ కోర్ట్ అన్ని విషయాలను పరిశీలించి ఎన్నికలు జరగాలి అని తీర్పు ఇస్తే మాత్రం కరోనా గురించి తెగబాధపడుతున్న చంద్రబాబుకు దిమ్మతిరగడం ఖాయమంటున్నారు వైసీపీ నాయకులు. చూడాలి మరి ఏపీలో ఎన్నికలు జరుగుతాయో లేదో..

Content above bottom navigation