ట్రంప్ ఇండియాకి రావడానికి కొన్ని గంటల ముందు ఏం చేసాడో తెలిసి షాకైన మోడీ..

134

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సోమవారం ఉదయం 11.40 గంటలకు చేరుకున్నారు. అమెరికా సైనిక విమానం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌‌లో భార్య మెలనియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు కుర్దిష్ సహా ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందంతో కలిసి చేరుకున్న ట్రంప్‌నకు ప్రధాని మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పలువురు కేంద్ర మంత్రుల ఘనస్వాగతం పలికారు. తర్వాత సబర్మతి ఆశ్రమానికి బయలుదేరారు. ట్రంప్ కాన్వాయ్ ముందు తెల్లని రంగు లో ఉన్న ఇన్నోవా వాహనాలు ముందు నడుస్తుండగా, వాటి వెనకాల నల్లటి రంగులో ఉన్న ట్రంప్ కాన్వాయ్ వాహన శ్రేణి వాటిని అనుసరిస్తోంది. దారికి ఇరువైపులా అహ్మదాబాద్ ప్రజలు తిరంగా జెండాలతో, సంప్రదాయ నృత్యాలతో, వస్త్రధారణతో ట్రంప్‌కు ఘన స్వాగతం పలుకుతున్నారు. రహదారులకు ఇరువైపులా ‘నమస్తే ట్రంప్’ అన్న నినాదాలతో ప్రజలు నినాదాలను హోరెక్కిస్తున్నారు. మరోవైపు ఆయా రహదారుల కూడల్లో గానీ, రోడ్డుకిరువైపులా ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ కటౌట్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఈ రోడ్ షో 22 కిలోమీటర్లు సాగుతుంది. మొట్టమొదటగా ట్రంప్ సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు

భారత లో మరికొన్ని నిమిషాల్లో అడుగు పెడతాడు అనుకున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హిందీలో ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘భారత్‌కు చేరుకోవడంపై చాలా ఆసక్తిగా ఉన్నాం. వస్తూనే ఉన్నాం. మరికొన్ని గంటల్లో అందర్నీ కలుసుకుంటాం’’ అని ట్రంప్ హిందీలో ట్వీట్ చేయడం విశేషం. ఈ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రియమైన ట్రంప్.. మీకు భారతదేశం అంటే ఇష్టం లేదు, మోదీ అంటేనే అభిమానం.. ఈ దేశం మిమ్మల్ని ఇష్టపడదు.. తిరస్కరించింది.. మోదీ వల్ల భారతదేశం లేదు.. భారతదేశం నుంచి మోదీ వచ్చారు… జై హింద్.. జై భారత్’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

ఇక కొద్దిసేపటి క్రితమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షో ప్రారంభమైంది. ట్రంప్ కాన్వాయ్ ముందు తెల్లని రంగు లో ఉన్న ఇన్నోవా వాహనాలు ముందు నడుస్తుండగా, వాటి వెనకాల నల్లటి రంగులో ఉన్న ట్రంప్ కాన్వాయ్ వాహన శ్రేణి వాటిని అనుసరిస్తోంది. దారికి ఇరువైపులా అహ్మదాబాద్ ప్రజలు తిరంగా జెండాలతో, సంప్రదాయ నృత్యాలతో, వస్త్రధారణతో ట్రంప్‌కు ఘన స్వాగతం పలుకుతున్నారు. రహదారులకు ఇరువైపులా ‘నమస్తే ట్రంప్’ అన్న నినాదాలతో ప్రజలు నినాదాలను హోరెక్కిస్తున్నారు. మరోవైపు ఆయా రహదారుల కూడల్లో గానీ, రోడ్డుకిరువైపులా ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ కటౌట్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఈ రోడ్ షో 22 కిలోమీటర్లు సాగుతుంది. మొట్టమొదటగా ట్రంప్ సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ గాంధీజీ జీవిత విశేషాలను తెలుసుకున్నారు. రాట్నంతో నూలు వడికి, ఆశ్రమంలో కలియతిరిగిన ట్రంప్ దంపతులకు ప్రధాని మోదీ అక్కడ విశేషాలను వివరించారు. అనంతరం మోతెరా స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి ట్రంప్ హజరయ్యారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మోతెరా స్టేడియం వరకు మొత్తం 22 కిలోమీటర్ల మేర రోడ్‌షో సాగింది. స్టేడియానికి చేరుకున్న ట్రంప్, మెలానియాకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్రమోదీ.. ట్రంప్‌‌నకు అమిత్‌ షా, ఇతర ప్రముఖులను పరిచయం చేశారు. అనంతరం వారితో కలిసి అక్కడ ఫొటో దిగారు. నమస్తే ట్రంప్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రపంచంలో అతిపెద్ద ఈ క్రికెట్ స్టేడియం జనసంద్రంగా మారింది. ట్రంప్-మోదీ నినాదాలతో స్టేడియం మారుమోగుతోంది. ఉదయం నుంచే స్టేడియానికి ప్రజలు పోటెత్తడంతో గ్యాలరీలు నిండిపోయాయి. మైదానంలో ఎటుచూసినా ట్రంప్ హోర్డింగ్‌లు, బ్యానర్లే దర్శనమిస్తున్నాయి.

Content above bottom navigation