అమెరికా దేశ అధ్యక్షుడు ప్రపంచ దేశాలకు పెద్ద అన్న
ఆర్దిక -రక్షణ- వ్యాపార- వస్తువులు -టెక్నాలజీ- ఇలా ఏది చూసుకున్నా అగ్రరాజ్యమే అన్నీ దేశాలకు శ్రీరామరక్ష
మరి ఆ శ్వేథ సౌథం నుంచి అధినేత వేరే దేశానికి పయనం అయితే ..అదీ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది
అందరి కళ్లూ ఆ దేశంపైనే ఉంటాయి, రెండు రోజుల పాటు అమెరికా అధినేత భారత్ పర్యటనలో కూడా ఇదే జరిగింది.
అన్నీ దేశాలు ప్రతీ విషయాన్ని అబ్జర్వ్ చేశాయి.
ఒప్పందాల నుంచి సందర్శనల వరకూ ప్రపంచం ఫిల్టర్లు వేసీ మరీ ప్రతీదీ చూసింది.
భారత్ పూలబాట వేస్తే అందులో ట్రంప్ సొగసుగా నడిచారు
ఒప్పందాలు సరే- ఆతిధ్యం సరే –
మరి నమో ట్రంప్ భారత టూర్ పై విదేశీ మీడియా హర్షించిందా – లేదా అక్షింతలు వేసిందా
ఈ ఖర్చు పై విదేశీ మీడియా ఏమందో ఇప్పుడు చూద్దాం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఆర్భాటాలకే పరిమితమైందే తప్ప వాస్తవంగా సాధించినదేమీ లేదని విదేశీ మీడియా వ్యాఖ్యానించింది. ముఖ్యంగా ‘నమస్తే ట్రంప్’ సభలో అమెరికా అధ్యక్షుడి ఉచ్చారణ దోషాలను దాదాపు అన్ని పేపర్లు, ఆన్లైన్ విదేశీ వార్తా సంస్థలూ ప్రస్తావించాయి.

వాషింగ్టన్ పోస్ట్ ఏమందంటే
భారత్‌తో వాణిజ్యపరమైన అంశాల్లో ఉద్రిక్తతల నడుమ ట్రంప్ భద్రతాపరమైన అంశాల్లో సహకారం పెంపొందించడంపై దృష్టిపెట్టారు. మోదీని మొండిఘటమని అభివర్ణించడం ద్వారా వాణిజ్య చర్చల్లో పురోగతే తప్ప ఒప్పందం కుదరదన్నది స్పష్టమైపోయింది. ఇక భారత ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస, బహుళత్వం గురించి ట్రంప్ అన్న మాటలు మత స్వేచ్ఛ గురించి అమెరికా ఆందోళనను వ్యక్తం చేశాయి.
న్యూయార్క్ టైమ్స్ ..ఏమందంటే
నమస్తే ట్రంప్ సభను హౌడీ మోదీ-2గా చెప్పవచ్చు. ఇది ట్రంప్‌కు నిస్సంకోచంగా, ఉల్లాసపరిచేందుకు సమర్పించిన ప్రశంస.. ఈ పర్యటనను ఓ కీలక శిఖరాగ్ర సదస్సుగా కంటే, సీరియస్ అంశాల కంటే ఓ పీఆర్ వ్యవహారంగా, ప్రజాకర్షకంగా మలచడానికి భారత్ ప్రయత్నించింది. అయితే, ఇది చిరస్మరణీయన్న విషయం కాదనలేం. ట్రంప్‌కు కనబడకుండా అక్కడి మురికివాడలకు అడ్డంగా గోడ కట్టారు. ఇది భారత్‌లో అనేక వ్యాఖ్యానాలకు, విమర్శలకు తావిచ్చింది. ఆ సెగ ట్రంప్‌కూ తగిలింది.
బీబీసీ… ఏమందంటే
ఈ పర్యటన ఎన్నికల వేళ ట్రంప్‌కు బాగా పనికొస్తుంది. భారీగా హాజరైన జనం విజువల్స్‌ను ఆయన ఉపయోగించుకుంటారు. తానంటే, ప్రపంచ దేశాల్లో ఎంత మంచి పేరుందో, ప్రతిష్ఠ ఉందో తెలియజెప్పేందుకు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో వివరించవచ్చు. ఈ పర్యటన ద్వారా ఆయన భారతీయ అమెరికన్ల ఓట్లను భారీగా సాధించగలరా.. అంటే సందేహమే. అమెరికాలో 45 లక్షల మంది భారతీయ అమెరికన్ ఓటర్లున్నారు. సాధారణంగా వారు డెమొక్రాట్ల వైపు మొగ్గుతారు. ట్రంప్‌కు వచ్చిన ఓట్లు 16 శాతమే. మోదీతో చెట్టపట్టాల్ వేసుకుని మసలడం ద్వారా ట్రంప్ భారతీయుల మనసుల్ని గెలవాలనుకున్నారు.
డాన్ పాక్ పత్రిక
హౌడీ మోదీ సభకు ప్రతిస్పందనగా ‘నమస్తే ట్రంప్’ను ఏర్పాటు చేశారే తప్ప మరొకటి కాదు. గట్టి ఒప్పందాలేవీ కుదరలేదు. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి ట్రంప్ సంసిద్ధత చూపారు. భారత గడ్డపైనే ఈ మాటన్నారు. దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడామన్నారు. ఇక ట్రంప్ పర్యటన వల్ల భారత్ కు ఓ 300 నుంచి 500 కోట్లు లాస్ మినహా వారు సాధించింది ఏమీ లేదు అంటున్నారు కొందరు, ట్రంప్ రాకకై భారత్ భారీగా డబ్బు వెచ్చించింది అని అంటున్నారు.