ట్రంప్ ప్రారంభించిన మొతేరా క్రికెట్ స్టేడియం ప్రత్యేకతలు

202

తొలిసారి భారత్ పర్యటనకు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఘన స్వాగతం లభించింది. అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం రూపానీ తదితరులు ట్రంప్ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుంచి సబర్మతి ఆశ్రమానికి చేరుకుని, గాంధీజీ జీవిత విశేషాలను తెలుసుకున్నారు. రాట్నంతో నూలు వడికి, ఆశ్రమంలో కలియతిరిగిన ట్రంప్ దంపతులకు ప్రధాని మోదీ అక్కడ విశేషాలను వివరించారు. అనంతరం మోతెరా స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి ట్రంప్ హజరయ్యారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మోతెరా స్టేడియం వరకు మొత్తం 22 కిలోమీటర్ల మేర రోడ్‌షో సాగింది. అక్కడికి చేరుకోగానే స్టేడియాన్ని ప్రారంభించారు ట్రంప్. ట్రంప్ ఓపెన్ చేసిన ఈ మొతేరా క్రికెట్ స్టేడియానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.. ఒక్కసారి వాటి గురించి పరిశీలిస్తే..

ప్రపంచంలో ఇప్పటివరకు అతి పెద్ద క్రికెట్ స్టేడియం అంటే ఇంగ్లాండ్ లో ఉన్న లార్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దానిని తలదన్నేలా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లోని మోటేరాలో 1.10 లక్షల మంది కూర్చుని ఒకేసారి మ్యాచ్ చూసేలా స్టేడియం రూపొందించారు. స్టేడియం నిర్మాణానికి 2018 జనవరిలో శంకుస్థాపన జరిగింది. ఈ స్టేడియం ఖర్చు దాదాపుగా 700 కోట్లు అయినట్లు తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ డ్రీం ప్రాజెక్ట్ లలో ఇది ఒకటి. ఈ ప్రాజెక్ట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలోచన. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేడియం నిర్మాణం పూర్తవుతోంది. ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ రాష్ట్రంపై ఉన్న మమకారంతో ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఇప్పుడు అక్కడ రూపకల్పన చేస్తున్నారు. ఈ స్టేడియం ప్రత్యేకత ఏమిటంటే, ఈ స్టేడియంలో వాటర్ మేనేజిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా స్టేడియంలోని ఒక్క చుక్క నీరు కూడా వృధా కాదట. మొతేరా స్టేడియంలో అత్యాధునిక సీటింగ్‌ సౌకర్యాలు, పకడ్బందీ డ్రైనేజీ ఏర్పాట్లు ఉన్నాయి. దాదాపుగా 3000 కార్లు 10 వేల ద్విచక్ర వాహనాలు పార్కింగ్ కు అనువుగా స్టేడియం రూపకల్పన చేసినట్లు తెలుస్తుంది.

ఈ స్టేడియాన్ని ప్రముఖ ఆర్చిటెక్చర్ సంస్థ పాపులస్ డిజైన్ చేసింది. నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టీ సంస్థ చేజిక్కించుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా ఉన్న మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంను కూడా పాపులర్ సంస్థే డిజైన్ చేసింది. మొత్తం 63 ఎకరాల స్థలంలో నిర్మిస్తోన్న ఈ స్టేడియంలో ఒకేసారి 1.10 లక్షల మంది కూర్చోవచ్చు. మెల్‌బోర్న్ స్టేడియం కెపాసిటీ 90వేలు. స్టేడియంలో మొత్తం నాలుగు డ్రెస్సింగ్ రూమ్‌లు ఉంటాయి. 50 గదులతో క్లబ్ హౌస్ ఉంటుంది. 76 కార్పోరేట్ బాక్సులు, పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. దీనిలో ఇండోర్ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ కూడా ఉంటుంది. పాత మొతేరా స్టేడియంలో కేవలం 54వేల మంది కూర్చునే సామర్థ్యం మాత్రమే ఉండేది. పున:నిర్మాణంలో భాగంగా దీన్ని 2016లో కూల్చేశారు. ఇప్పుడు దీని ఓపెనింగ్ జరిగింది. ఈ స్టేడియం వచ్చే నెలలో ప్రారంభం కానుండటంతో ఐపీఎల్ ఏమైనా ఈ స్టేడియంలో పెట్టే అవకాశం ఉందో లేదో చూడాలి. ఇక ఈ గ్రౌండ్ తో పలువురు భారత క్రికెటర్స్ కు మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. భారత లెజెండ్లు పలు రికార్డులను నెలకొల్పారు. సునీల్ గవాస్కర్ 10000 పరుగుల టెస్టు రన్స్ ను సాధించింది.. కపిల్ దేవ్ 431 టెస్టు వికెట్లు తీసింది ఈ మైదానం లోనే.. 1999లో సచిన్ తన మొదటి డబుల్ సెంచరీని ఇక్కడే అందుకున్నాడు. ఇప్పుడు కొత్తగా నిర్మితమైన ఈ గ్రౌండ్ లో ఎవరు ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడతారో చూడాలి.

Content above bottom navigation