తెలంగాణ ప్రజలకు పెద్ద శుభవార్త.. వెంటనే మీ బ్యాంకు అకౌంట్ చెక్ చేసుకోండి

111

రైతులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త అందించింది. రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. రైతుబంధు పథకంలో భాగంగా రబీ పంటకు నిధులు మంజూరు చేసింది. రూ.3630 కోట్ల నిధులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. రబీలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఈ నగదు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. 2019-20 వార్షిక బడ్జెట్‌లో రైతుబంధు కోసం రూ.12,862 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఖరీఫ్‌లో రూ.6,862 కోట్లు మంజూరు చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయగా.. తాజాగా రబీ కోసం రూ.3630 కోట్ల నిధులను విడుదల చేశారు.

Image result for kcr

రబ్బీ సాగు మొదలయిన నేపథ్యంలో రైతులకు పంట పెట్టుబడులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన వారి ఖాతాలలో డబ్బులు జమ చేయాలని, రైతులు నష్టపోకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం నుండి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే నాలుగు విడతలుగా రైతుల ఖాతాలలోకి ఆర్బీఐ ఈ కుబేర్ ద్వారా నేరుగా రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయని పేర్కొన్నారు.

మొత్తం 21.22 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు డబ్బులు జమచేయడం జరిగిందని, రైతుబంధు అకౌంట్ నంబర్ మార్చుకోవాలనుకునే రైతులు సమీప వ్యవసాయ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం సహకార సంఘాలు, మహిళా సంఘాలు, వ్యవసాయ మార్కెట్ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.4837 కోట్లు 3,85,217 మంది రైతులకు చెల్లించడం జరిగిందని, రూ.1080 కోట్లు బకాయిలు ఉన్నాయని నిరంజన్ రెడ్డి గారు వెల్లడించారు. సోమవారం నాడు రూ.3630 కోట్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు.

Image result for kcr

రైతులు ధాన్యం డబ్బుల విషయంలో, రైతుబంధు డబ్బుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన పనిలేదని అన్నారు. రాష్ట్రానికి రుతుపవనాలు మరికొద్ది రోజులలో రానున్న నేపథ్యంలో రైతుబంధు డబ్బులు త్వరగా జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆర్థిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ కూడా వెంటనే పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల మంజూరుకు సంబంధించిన పరిపాలనా అనుమతులు రావడంతో వ్యవసాయ శాఖ రైతుల వివరాలను ఆర్థిక శాఖకు అందించనుంది. వివరాలు అందిన వెంటనే ఆర్థిక శాఖ సదరు నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రైతు బంధు, రైతు రుణ మాఫీ నిధులను ప్రధానాస్త్రంగా చేసుకొని ప్రతిపక్షాలు విమర్శలు చేయగా.. ఆ విమర్శలకు చెక్ పెడుతూ ఎన్నికలకు ముందే రైతు బంధు నిధులు విడుదల చేయడం గమనార్హం.

Content above bottom navigation