దిశ యాప్ తొలి సక్సెస్.. ఆనందంతో చప్పట్లు కొట్టిన జగన్

128

దిశ యాప్ తొలి సక్సెస్.. ఆనందంతో చప్పట్లు కొట్టిన జగన్

దిశ చట్టానికి ఏపీలో మొదటి సక్సెస్ అందింది. ..ఆడవారికి రక్షణగా తీసుకొచ్చిన ఈ చట్టం వారిలో మరింత ధైర్యాన్ని నింపింది. ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు నిమిషాల వ్యవధిలోనే ఆకతాయిని పట్టుకుని అరెస్ట్ చేశారు.దీంతో ఈ దిశ యాప్ ఎంత ఉప‌యోగ‌క‌ర‌మో ఇప్పుడు అంద‌రికి అర్దం అవుతోంది… మూడు రోజుల్లో ఇలా ప‌లు కేసులు న‌మోదు అవ‌డంతో వారికి భ‌రోసా క‌ల్పిస్తున్నారు పోలీసులు.

ఆపదలో ఉన్న ఓ మహికు అండగా నిలిచింది దిశ యాప్ . విశాఖ నుంచి విజయవాడ బస్సులో వెళుతున్న ప్రభుత్వ మహిళా అధికారిని తోటి ప్రయాణికుడు వేధించగా.. ఆమె దిశ యాప్ సాయంతో పోలీసులకు సమాచారం అందించింది. కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోని అక్కడికి చేరుకొని నిందితుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు.

Image result for disha app andhra pradesh

నేడు తెల్లవారు జామున 4:30 గంటల క్రమంలో ఒక మహిళ SOS యాప్ ద్వారా తనను గుర్తు తెలియని వ్యక్తి వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే ఆ సమాచారం అందుకున్న ఏలూరు త్రీ టౌన్ పోలీసులు కేవలం నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకుని ఆ ఆకతాయిని పట్టుకున్నారు. ఒంటరిగా ఉన్న మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఆ ఆకతాయి ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఏదేమైనా సదరు మహిళను జాగ్రత్తగా ఇంటికి పంపించారు.

మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన డీజీపీ గౌతమ్ సవాంగ్.. ఘటన గురించి వివరించారు. యాప్ పనితీరు.. మహిళను ఎలా రక్షించారన్న అంశాలపై క్లారిటీ ఇచ్చారు. డీజీపీ ప్రజెంటేషన్ తర్వాత జగన్ ఆనందంతో చప్పట్లు కొట్టారు.. పోలీసుల్ని అభినందించారు. సమాచారం అందిన వెంటనే కేవలం ఏడు నిమిషాల్లోనే వెళ్లి.. నిందితుడ్ని అరెస్ట్ చేయడంపై ప్రశంసలు కురిపించారు.. పోలీసుల్ని అభినందించారు.

సీఎం జగన్ తన ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఆపదలో ఉన్న ఓ మహిళ దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారాన్ని అందించింది.. SOS బటన్ నొక్కిన 7నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకోవడం.. వెంటనే ఆ మహిళకు రక్షణ కల్పించి.. కేసును నమోదు చేయడం దిశ యాప్ పనితీరుకు చక్కని ఉదాహరణగా నిలిచింది అన్నారు జగన్. దిశ యాప్ కు అనుసంధానంగా పనిచేస్తున్న పోలీసులకు, అధికారులకు అభినందనలు తెలియజేశారు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation