ప్రధాని భద్రత కు గంటకు 7 లక్షలు

96

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రత అంటే అది సాధారణ విషయం కాదు. అనునిత్యం కమాండోలు అప్రమత్తంగా ఉంటూ డేగ కళ్ళతో, ఒళ్ళు అంతా కళ్ళు చేసుకుని ఉండాలి. ఆయన భద్రత కోసం, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పిజి)ని కేంద్రం నియమించింది. దేశంలో ఆ భద్రత ఉన్న ఒకే ఒక వ్యక్తి మోడీ కావడం విశేషం

దేశంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పిజి) క్రింద దేశంలో ఒర‌నిరి మాత్రమే ఎస్పీజీ భద్రతను కల్పిస్తున్నారు. సిఆర్‌పిఎఫ్ దేశంలో 56 మంది ముఖ్యమైన వ్యక్తులను రక్షణ కల్పిస్తుంది ఆ ఒక్క‌రు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ మాత్ర‌మే.

Image result for modi spg security

భారత ప్రధాని నరేంద్ర మోడీకి కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. వీవీఐపీ కేటగిరీలో ప్రధానికి అడుగడుగునా అత్యంత సుశిక్షితులైన భద్రతా సిబ్బంది కవచంలా ఉంటారు. అందులోనూ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతూ…పాక్ ముష్కరులను ముప్పుతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న భారత ప్రధానిని ఎస్పీజీ భద్రతా సిబ్బంది కంటికి రెప్పలా కాపలా కాస్తుంటారు. దేశంలో కేవలం ప్రధానికి మాత్రమే పరిమితమైన ఎస్పీజీ భద్రతకు కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో భారీగా నిధులు కూడా కేటాయించింది. మన దేశ ప్రధాని భద్రత కోసం ప్రతి రోజు రూ. 1.62 కోట్లు ఖర్చు చేస్తున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లోక్ సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

మన దేశంలోని వీవీఐపీ పొలిటిషియన్లు వీఐపీ పొలిటిషియన్లు ఎంపీలలకు వారి వారి ప్రాధాన్యతను బట్టి భద్రతను కేటాయిస్తారు. ప్రధాని మాత్రమే ఎస్పీజీ భద్రత కల్పిస్తారు. మిగతా నేతలకు సీఆర్పీఎఫ్ భద్రతను కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరెవరికి ఎటువంటి భద్రత కల్పిస్తున్నారంటూ డీఎంకే ఎంపీ దయానిధి మారన్ లోక్ స‌భలో ప్రశ్న అడిగారు. భారత్లో ఎస్పీజీ భద్రత పొందుతున్న ఏకైక వ్యక్తి ప్రధాని అని కిషన్ రెడ్డి ఆ ప్రశ్నకు సమాధానమిచ్చారు. వివిధ రాష్ట్రాల్లోని 56 మంది వీఐపీలకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. 3000 మంది ప్రత్యేక కమాండోలున్న ఎస్పీజీకి గత బడ్జెట్లో రూ.592.55 కోట్లు కేటాయించారు. ప్రధాని భద్రతకు గంటకు రూ.6.75 లక్షల చొప్పున రోజుకు రూ.1.62 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురికి ఎస్పీజీ భద్రతను ఉపసంహరించిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాకి ఈ భద్రత ఉండేది. . అంటే పిఎం మోడీ సహా గాంధీ కుటుంబాన్ని ముగ్గురు గాంధీలను రక్షించడానికి సగటున ఒక్కొక్కరికి 135 కోట్ల రూపాయలు ఖ‌ర్చుచేసేవారు.. కాని వీరికి ఆ సెక్యూరిటీ తొల‌గించారు.

అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య తరువాత ఎస్పీజీ ఉనికిలోకి వచ్చింది. ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ప్రధానమంత్రి వారి కుటుంబ రక్షణ కోసం ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. రాజీవ్, సోనియా వారి పిల్లలు రాహుల్ ప్రియాంక గాంధీలకు తర్వాత ఆటోమేటిక్ గా ఎస్పీజీ భద్రతను కేంద్రం కల్పిస్తుంది.

1989 లో అధికారం మారడంతో, వీపీ సింగ్ ప్రభుత్వం గాంధీలకు ఎస్పీజీ కవర్‌ను ఉపసంహరించుకుంది. రాజీవ్ గాంధీ 1991 లో హత్యకు గురయ్యారు. అదే సంవత్సరం కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. పివి నరసింహారావు ప్రధాని అయ్యారు, సోనియా గాంధీ సిఫారసు మేరకు, రావు ప్రభుత్వం ఎస్పీజీ కవర్‌ను గాంధీలకు పునరుద్ధరించింది. గత ఏడాది నవంబర్ వరకు వారికి ఎస్పీజీ భద్రత ఉంది.దీనిని సిఆర్‌పిఎఫ్ సెక్యూరిటీ కవర్‌తో భర్తీ చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది…ఇక ఎస్పీజీ దళంలో భద్రతా సిబ్బందితో పాటు అధునాతన వాహనాలు, జామర్లు, ఆంబులెన్స్‌లు వినియోగిస్తారు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation