ప్రభుత్వం సంచలన నిర్ణయం… ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజులే డ్యూటీ..

మీరు ఏ ఉద్యోగం చేసినా కూడా వారానికి ఆరు రోజులు పని చెయ్యాలి. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు అయితే ఐదు రోజులే ఉంటాయి. కానీ వారానికి ఐదు రోజులు వర్క్ ఉండి, మిగతా రేణు రోజులు హాలిడే ఉంటూ బాగుండు అని అనిపిస్తుంది కదా. అలా అనుకునేవారి కోసమే మహారాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుండి మహారాష్ట్ర రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు వారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే పని చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు శనివారం, ఆదివారం ఆఫీస్ కు రావాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం ఐదు రోజులే డ్యూటీ అనే శుభవార్తను చెప్పినప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని ట్విస్ట్ ఒకటి ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు ఇకనుండి రోజుకు మరో 45 నిమిషాల సమయంపాటు ప్రతిరోజు అదనంగా పని చేసే విధంగా ప్రభుత్వం నిబంధనలలో మార్పులు చేసింది.

Image result for cm uddhav thackeray

2020, ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం సీఎం ఉద్దవ్ థాకరే అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల పని దినాలపై నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఏడో రాష్ట్రంగా అవతరించింది. దాదాపు 20 లక్షల మంది అధికారులు, ఉద్యోగులకు ప్రయోజనం పొందుతారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం ముంబైలో ఉదయం 9.45 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు, 30 నిమిషాల భోజన విరామంతో సహా ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తుంటారు. రెండవ శనివారం, నాలుగవ శనివారం సెలవులు లభిస్తాయి. కొత్త పని గంటల ప్రకారం ఉదయం 9.45 నుంచి సాయంత్రం 6.15 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య భోజనం విరామం ఉంటుంది. ఐదు రోజుల కారణంగా విద్యుత్, నీరు, డీజిల్, పెట్రోల్ ఖర్చులు ఆదా అవుతాయని, అంతేగాకుండా వారి వారి కుటుంసభ్యులతో ఆహ్లాదంగా గడపొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

Image result for ప్రభుత్వం సంచలన నిర్ణయం… ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజులే డ్యూటీ..

పోలీసు, అగ్నిమాపక దళం, ప్రభుత్వ కళాశాలలు, పాలిటెక్నిక్ కాలేజీలు, పారిశుధ్య కార్మికులు, ముఖ్యమైన సేవలకు ఇది వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది. ఐదు పని దినాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తుందనే సంగతి తెలిసిందే. రాజస్థాన్, బీహార్, పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఐదు రోజుల పనిదినాలు అమల్లో ఉంది. దేశంలో ఐదు రోజుల పనిదినాలను అమలు చేయనున్న ఏడవ రాష్ట్రంగా మహారాష్ట్ర నిలవనుంది.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation