బిగ్ బ్రేకింగ్ ఈసి రమేష్ కు కేంద్రం షాక్

ఏపీలో లోక‌ల్ వార్ ఏకంగా వైసీపీకి టీడీపీకి కాకుండా
వైసీపీకి ఈసీకి మ‌ధ్య వార్ కు కార‌ణం అయింది
క‌రోనా ఎఫెక్ట్ తో ఎన్నిక‌లు వాయిదా వేస్తున్నాం అని ఎన్నికల సంఘం ప్ర‌క‌టించింది
ఎన్నిక‌ల వాయిదాపై ఎన్నిక‌ల అధికారి తీరుని సీఎం జ‌గ‌న్ త‌ప్పుబ‌ట్టారు.
మాజీ ముఖ్య‌మంత్రి అనున‌యుడిగా ఈసీ ర‌మేష్ కుమార్ ని విమ‌ర్శించారు
కావాల‌నే ఎన్నిక‌లు ఆపారు అని విమ‌ర్శించారు
వైసీపీ నాయ‌కులు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈసీ చ‌ర్య‌ని ప్ర‌శ్నించారు
మొత్తానికి సుప్రీం కోర్టు కూడా మేము క‌లుగ చేసుకోం అనేస‌రికి ఈసీ మాట చెల్లుబాటు అయింది.
ఆరువారాలు ఎన్నిక‌లు వాయిదాప‌డ్డాయి
కాని వాట్ నెక్ట్స్ అంటే మాత్రం?
ఇప్పుడు ర‌మేష్ కుమార్ ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటారు అని మ‌రో వార్త వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రమేష్ కుమార్ రాజీనామా చేసే అవకాశాలు కనపడుతున్నాయి అంటున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన లక్ష్యంగా అధికార పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఎన్నికలను వాయిదా వేయడంపై అసహనంగా ఉన్న అధికార పార్టీ ఆయన లక్ష్యంగా మండిపడుతుంది. ఎవరిని అడిగి వాయిదా వేసారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఇక ఆయనకు సిఎస్ లేఖ రాయడం, ఆ తర్వాత రమేష్ కుమార్ లేఖ రాయడం, తాజాగా రమేష్ కుమార్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ వెళ్ళడం సంచలనంగా మారాయి. తాను లేఖ రాయలేదు అని రమేష్ కుమార్ చెప్తున్నా సరే ఆయన ప్రమేయం లేకుండా ఆ లేఖ వెళ్ళే అవకాశం లేదని పలువురు అంటున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లేఖ పంపిన వారిపై చర్యలు తీసుకోవాలని రెడీ అవుతుంది.

Image result for ec ramesh kumar

దీనితో తీవ్ర ఒత్తిడి లోకి వెళ్ళిపోయిన రమేష్ కుమార్ రెండు రోజుల నుంచి ఎవరిని కలవడం లేదు. ఆయన కుటుంబ సభ్యులను అత్యంత సన్నిహితంగా ఉన్న వారిని మాత్రమే కలుస్తున్నారు. ఆయన రాజీనామా చేస్తున్నారని పలువురు అంటున్నారు. ఒత్తిడి భరించలేని ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసే అవకాశం ఉందని అంటున్నారు. రేపు సాయంత్రంలోగా ఆయన నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు…. ఇటు పార్టీల వ్య‌వ‌హారం కాస్త ఈసీకి ఇబ్బందిక‌ర ప‌రిణామంగా మారింది అంటున్నారు, మ‌రి చూడాలి దీనిపై ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో.

Content above bottom navigation