బ్రేకింగ్ న్యూస్ : ఢిల్లీ పర్యటనకు సీఎం జగన్…!

81

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రాష్ట్ర పరిస్థితుల గురించి, ఏపీలో జరగబోయే ఎన్నికల సమరానికి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలను కేంద్ర పెద్దలకు చెప్పడానికి ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఆయన ఢిల్లీ టూర్ కు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చాల ఆగ్రహంగా ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని పరిణామాలపై కేంద్ర పెద్దలు ఆగ్రహంగా ఉన్నారని మీడియా కూడా అంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి కారణం ఏంటీ అనేది కూడా స్పష్టంగా తెలియడం లేదు. ఈ నేపధ్యంలోనే జగన్ ని ఢిల్లీ పెద్దలను కలిసి కేంద్రానికి వివరించాలని భావిస్తున్నారట. అసలు రాష్ట్రంలో జరిగిన పరిణామాలకు సంబంధించి నేరుగా ఆయన ద్వారానే తెలుసుకునే ప్రయత్నాలు కేంద్రం చేస్తుంది అంటున్నారు. బిజెపి ఎంపీలు జగన్ పై ఫిర్యాదు చేసారు. కొన్ని వీడియోలను కూడా వారికి చూపించారు. దీనితో రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆయన కేంద్ర పెద్దలకు వివరించే అవకాశం ఉందని సమాచారం.

అలాగే ఎన్నికలను వాయిదా వేయవద్దు అని ఆయన కోరినట్టు తెలుస్తుంది. ఇప్పటికే విజయసాయి రెడ్డి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారని అంటున్నారు.త్వరలోనే జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ని కలిసి వివరించే ప్రయత్నం చేసే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో కరోనా లేదని, అసలు ఆ ప్రభావం లేదని, కాబట్టి ఎన్నికల ప్రక్రియను పూర్తి చెయ్యాలని ఆయన కోరే అవకాశం ఉందని అంటున్నారు. బుధవారం లేదా గురువారం జగన్ ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. దీనిపై రేపు ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Image result for ఢిల్లీ పర్యటనకు సీఎం జగన్

కాగా ఎన్నికలను వాయిదా వేయడంపై వైసీపీ సుప్రీం కోర్ట్ కి వెళ్ళిన సంగతి విదితమే. ఇక ఎన్నికాలు వాయిదా వేసిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కు కూడా కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఫోన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీలో ఎన్నికలు వాయిదా వెయ్యడం, అలాగే రాష్ట్ర పరిస్థితుల మీద కూడా రమేష్ కు ఫోన్ చేసి అడిగినట్టు వార్తలు వస్తున్నాయి. రమేష్ కుమార్ కూడా ఢిల్లీ వెళ్లే సూచనలు ఉన్నాయి.ఢిల్లీ వచ్చి ఏపీలో జరిగే ఎన్నికల పరిస్థితుల గురించి వివరించమని అమిత్ షా ఆదేశించినట్టు తెలుస్తుంది.

Content above bottom navigation