మద్యం బంద్.. ఎలక్షన్స్ కి ముందు జగన్ సంచలన నిర్ణయం

115

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. మొత్తం మూడుదశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్ని ఒకే దశలోను, గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మాత్రం రెండు దశల్లో నిర్వహిస్తామన్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్రంలో పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. 21న ఎంపీటీసీ స్థానాలకు, 23న మున్సిపల్‌, నగర పంచాయతీ, కార్పొరేషన్లకు ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 27, 29 తేదీల్లో రెండు దశల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు దఫాలుగా ఏపీలో స్థానిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా.. రెండు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 660 జెడ్‌పీటీసీ, 9,639 ఎంపీటీసీలకు మొదటి దశలో ఎన్నికలు జరగనుండగా.. పంచాయతీలకు మరో దశలో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇక మూడో దశలో మున్సిపాలీటీలకు ఎన్నికలు జరుగుతాయి.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొద్ది రోజుల పాటు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రకటించారు. ఈ నెల 12 నుంచి 29 వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు వెల్లడించారు. ఆయా రోజుల్లో దుకాణాలకు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు అనిల్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటర్లపై డబ్బు, మద్యం ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నిక చరిత్రలోనే మొదటిసారి మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్టు తెలిపారు.

Image result for jagan

ఇక ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే….మార్చి 9 నుంచి 11 వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.
మార్చి 17 నుంచి 19 వరకు పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మార్చి 21న ZPTC, MPTC (పరిషత్ ఎన్నికలు) ఎన్నికల పోలింగ్ ఉంటుంది. మార్చి 24న ZPTC, MPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. మార్చి 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉంటుంది. మార్చి 27న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. మార్చి 27న మొదటిదశ సర్పంచ్ (గ్రామ పంచాయతీ) ఎన్నికలు జరుగుతాయి. మార్చి 29న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. మార్చి 29న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇలా ఏపీలో స్థానిక ఎన్నికల సమరం ముగుస్తుంది. చూడాలి ఈ సమరంలో ఎవరు గెలుస్తారో.ఎవరు ఓడతారో..

Content above bottom navigation