మాజీ మంత్రులకు భద్రత పూర్తిగా తొలగింపు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

53

ఏపీలో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం, తాజాగా కొంద‌రు నేత‌ల‌కు సెక్యూరిటీ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అయితే దీని గురించి కొద్ది రోజులుగా చ‌ర్చ జ‌రుగుతోంది అలాగే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు… అందరూ అనుకున్న విధంగానే మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. మాజీమంత్రులకు ఇప్పటి వరకు ఉన్న 1+1 గన్ మెన్ల భద్రత తొలగించారు. జేసీ సోదరులకు, పరిటాల శ్రీరామ్ కు గన్ మెన్లను తొలగించింది.

Image result for ap all ministers

మాజీ మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, నక్క ఆనంద్ బాబు, జెసి దివాకర్ రెడ్డి, పల్లె రఘనాథరెడ్డి, కాల్వ శ్రీనివాసులు లకు భద్రత తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యేలు జివి ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు లకు భద్రతను మంగళవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.

అనంతపురం జిల్లాలో టీడీపీకి చెందిన ప్రముఖ నేతల భద్రతను ప్రభుత్వం తొలగించింది. భద్రతను తొలగించిన వారిలో మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్ రెడ్డి ఉన్నారు. స్టేట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఆదేశాల మేరకే భద్రత తొలగించామని పోలీసులు చెబుతున్నారు. అయితే తమ భద్రత తొలగింపుపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తమకు ఎటువంటి ముందస్తు నోటీసులు.. సమాచారం లేకుండా ఉన్నపళంగా భద్రత తొలగించడం ఏంటని ప్రభుత్వాన్ని నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తమకు భద్రత కొనసాగించారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు భద్రతను కుదించి.. ప్రస్తుతం పూర్తిగా తొలగించడంపై నేతలు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లకుండా నిలువరించేందుకు ప్రభుత్వం భద్రతను తొలగించిందని నేతలు విమ‌ర్శిస్తున్నారు.

గతంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఏపీ ప్రభుత్వం భద్రత తగ్గించించింది. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ఉన్న భద్రతను తగ్గించారు. జెడ్ క్యాటరిగి ఉన్న లోకేష్ కి భద్రత తగ్గించారు. గతంలో లోకేష్ కి 5+5 భద్రత ఉండేది. కాగా దానికి 2 +2కు కుదిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక మిగిలిన ఇతర కుటుంబసభ్యులకు పూర్తిగా భద్రతను తొలగించారు.

మరోవైపు భద్రత తొలగింపుతో టీడీపీ నేతల్లో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇది కేవలం కక్ష సాధింపు చర్య అవుతుందని పలువురు మండిపడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైపీపీ ప్రభుత్వ తీరుపై పలువురు మండిపడుతున్నారు. ఈ నిర్ణయం ఏ మాత్రం సరికాదని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. మ‌రి ఇంకెంద‌రికి ఈ తొల‌గింపు ఉంటుందో చూడాలి.

Content above bottom navigation