మోడీ ఇచ్చిన గిఫ్ట్ చూసి పులకరించిపోయిన ముద్దుగుమ్మ.. షాకైన ట్రంప్

88

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సోమవారం ఉదయం 11.40 గంటలకు చేరుకున్నారు. అమెరికా సైనిక విమానం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌‌లో భార్య మెలనియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు కుర్దిష్ సహా ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందంతో కలిసి చేరుకున్న ట్రంప్‌నకు ప్రధాని మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పలువురు కేంద్ర మంత్రుల ఘనస్వాగతం పలికారు. సంప్రదాయ నృత్యాలు, వాయిద్యాలతో కళాకారులు స్వాగతం పలకగా, ట్రంప్ తన వాహనం వద్దకు చేరుకున్నారు. అనంతరం అక్కడ నుంచి మోదీతో కలిసి శబర్మతి ఆశ్రమానికి ట్రంప్ బయలుదేరారు. మధ్యాహ్నం 12.15లకు శబర్మతి ఆశ్రమానికి చేరుకుని, అక్కడ నుంచి గాంధీనగర్‌లో నిర్మించిన మొతేరా స్టేడియాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తారు.

ఈ విషయం ఇలా ఉంటె.. అమెరికాకు ప్రథమ పౌరుడు ట్రంప్ అయితే, ఆయన భార్య మెలానియా ప్రథమ పౌరురాలు. అయితే భారత్ విషయానికి వస్తే రాష్ట్రపతిని పక్కనపెడితే ప్రధాని మోడీ ప్రథమ పౌరుడు.. కానీ మోడీకి భార్య లేకపోవడంతో ప్రథమ పౌరురాలు లేదు. దాంతో ట్రంప్ భార్యకు స్వాగతం సహా సత్కారాల విషయంలో మోడీ ఇబ్బంది పడాల్సి వచ్చింది. మోడీ అప్పుడెప్పుడో చిన్నప్పుడు వివాహం చేసుకొని భార్యను వదిలేసి బ్రహ్మచారిగా ఉంటున్నారు. దీంతో మోడీ ఒక్కడే ట్రంప్ ను ఆయన భార్యను ఎలా సత్కరించాడు. అలాగే మోడీతో జరిగే మీటింగ్ లోనే ట్రంప్ భార్యకు మోడీ బహుమతిగా ఇచ్చేందుకు ఓ అరుదైన చీరను సిద్ధం చేశారట.. ఆ చీర పేరు ‘పటోలా’. ఈ చీరను ప్రభుత్వంలో ఉన్న ఒక మహిళతో ఇప్పించనున్నారు మోడీ.

Image result for trump india with wife

ఇక మోడీ మెలానియాకు ఇచ్చే పటోలా చీర గురించి ప్రస్తావించాలంటే.. పటోలా చీర అంటే గుజరాత్ సంస్కృతి లో ఓ భాగం. చీరకు ప్రత్యేకత ఉంటుంది. చీరను పూర్తిగా చేతితోనే ఆరుగురు కలిసి నేస్తారు. ఆరు నెలలు కష్టపడితేనే చీర తయారవుతుంది. చెట్ల నుంచి తీసిన సహజరంగులనే చీరకు వాడుతారు. స్వచ్ఛమైన పట్టును ఉపయోగిస్తారు. పటోలా చీర ప్రపంచవ్యాప్తంగా గుజరాత్ కు బ్రాండ్ ను క్రియేట్ చేసింది. ఈ చీర ప్రత్యేకత ఏంటంటే ఎన్ని సంవత్సరాలైనా చీరలో మెరుగు తగ్గదు. ఉతికినా రంగు మారదు. 90 ఏళ్ల చరిత్ర పటోలా చీర సొంతం.. పఠాన్ లోని సాల్వి కుటుంబం ఈ చీరను తయారు చేస్తుంది. బంగారంతో తయారు చేస్తున్న ఈ ఖరీదైన చీరను మోడీ తాజా పర్యటనలో ట్రంప్ భార్యకు ఇవ్వబోతున్నాడు. సంప్రదాయవాదులు మోడీ ఇలా ఇవ్వవచ్చా ఇవ్వకూడదు అన్న వాదన వినిపిస్తున్నా.. పాశ్చాత్య అమెరికన్స్ ఇవేవీ పట్టించుకోరు కాబట్టి మోడీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Content above bottom navigation