రూ.2 వేల నోట్ల రద్దుపై కేంద్రం సంచలన ప్రకటన..

85

డీమానిటైజేషన్ అనేది దేశంలో ఎంత పెద్ద సంక్షోభాన్ని గురిచేసిందో మన అందరికి తెలిసిందే. సరిగ్గా రెండేళ్ల క్రితం నరేంద్రమోడీ రాత్రికి రాత్రి ఈ నిర్ణయాన్ని తీసుకుని దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశాడు.పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేసి వాటి స్థానంలో కొత్త 500, 2000 నోట్లను తీసుకొచ్చాడు.ఆ సమయంలో అపర కుభేరులు దాచిపెట్టిన కోట్ల డబ్బును ఏం చెయ్యాలో తెలియక నానా ఇబ్బందులు పడ్డారు. అపర కుబేరులే కాదు సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే డిమానిటైజేషన్‌ తర్వాత పాత నోట్లను మార్చుకున్నవారు మార్చుకున్నారు.చేతకాని వారు లేదా భయపడి చాలా మంది ఆ పాత నోట్లను పారేసిన వాళ్ళు ఉన్నారు.కొందరు అయితే తగలబెట్టినవారు ఉన్నారు. ఇక కొత్తగా తీసుకొచ్చిన రూ.2000 నోటు వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సరిగా చిల్లర దొరకక మొదట్లో చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇక రూ.2,000 నోట్ రిలీజ్ అయినా కొన్ని రోజుల తర్వాత నుంచి రూ.2000 నోట్లపై ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

ఇటీవల కూడా కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోట్లను రద్దు చేసేస్తుందని వార్తలు బాగా వినిపించాయి. అయితే వీటికి కేంద్రం స్పందించింది. రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని మోదీ సర్కార్ స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు రూ.2,000 నోట్లకు సంబంధించి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేసే విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దీంతో ప్రజలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను నమ్మవద్దు. అధిక విలువ కలిగిన రూ.2 వేల నోట్ల వల్ల ప్రజలు చిల్లర కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ వంటివి ఏటీఎంలలో రూ.500, రూ.200 నోట్లను ఎక్కువగా ఉంచుతున్నాయని అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. దీంతో ప్రజలకు రూ.2,000 నోటు మార్పిడి సమస్యలు ఎక్కువగా ఉండవని పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.7.40 లక్షల కోట్ల విలువైన రూ.2000 కరెన్సీని ముద్రించినట్లు అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. రూ.2 వేల నోట్లకు సంబంధించి ప్రజలు ఎలాంటి భయాలూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రూ.2000 నోట్లు కొనసాగనున్నాయి.

కాగా కేంద్రం రూ. 2000 నోట్ ను రద్దు చేస్తుందని వార్తలు రావడం వెనుక కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే RBI రూ. 2000 నోట్ల ముద్రణను చాలావరకు తగ్గించింది. 2017లో మొత్తం కరెన్సీలో 50శాతం ఉన్న రూ.2వేల నోట్లు, రెండేళ్ల కాలంలో 37 శాతానికి పడిపోయాయి. ముద్రణ సైతం 2017లో రూ. 350.4 కోట్లుండగా, కేవలం రెండేళ్ల వ్యవధిలో రూ.1.51 కోట్లు పడిపోయింది. అదే సమయంలో 500 రూపాయల నోట్ల చలామణీ 2017తో పోలిస్తే.. 43 శాతానికి పెరగడం గమనార్హం. దీనికి కారణాలేంటన్నది ఆర్బీఐ వెల్లడించలేదు. ఇలా ముద్రణను తగ్గించడం వలనే రూ. 2000 నోట్ రద్దు చేసే ఆలోచనలో కేంద్రం ఉందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా దేశంలో చాలా చోట్ల పట్టుబడిన నకిలీ నోట్లలో రూ.2,000 ఎక్కువగా ఉన్నాయి. 2018-19 లో దేశంలో పట్టుకున్న నకిలీ నోట్లలో 56 శాతం రూ.2000 విలువైన నోట్లే కావడం గమనార్హం. 2017, 2018 సంవత్సరాల్లో పట్టుబడిన నకిలీ కరెన్సీ విలువ రూ.46.06 కోట్లు. అందులో 56.31 నోట్లు రూ.2000 నోట్లేనని ఎన్సీఆర్బీ నివేదికలో తేలింది.2017లో రూ.28.10 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని దర్యాప్తు అధికారులు పట్టుకుంటే అందులో 53.30 శాతం, 2018లో పట్టుకున్న నకిలీ నోట్లలో 61.01 శాతం రూ.2000 నోట్లే. పట్టుబడ్డ నకిలీ నోట్లలో అత్యధికం గుజరాత్ రాష్ట్రం నుంచే ఉన్నాయి.

Image result for రూ.2 వేల నోట్ల రద్దుపై

2019లో గుజరాత్ రాష్ట్రంలో 34,680 నోట్లు రూ.2000 విలువైనవి. నోట్ల రద్దు తర్వాత గుజరాత్లో పట్టుబడిన నకిలీ నోట్లు దేశమంతా కలిపితే 26.28 శాతం. తర్వాతీ జాబితాలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. జార్ఖండ్, మేఘాలయ, సిక్కిం రాష్ట్రాల్లో మాత్రం ఒక్క రూ.2000 నోటు కూడా నకిలీ నోట్ దొరకలేదు. అలాగే పాకిస్తాన్ నుంచి కూడా మన దేశంలోకి ఫేక్ రూ.2,000 నోట్లు ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం రూ.2 వేల నోట్లను రద్దు చేయొచ్చని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు చక్కలు కొట్టాయి. కానీ ఇప్పుడు కేంద్రం రూ. 2000 నోట్ రద్దు చేసే ఆలోచనలో లేనట్టు స్పష్టంగా తెలియజేసింది. కాబట్టి ఎవరు కూడా సోషల్ మీడియాలో వస్తున్నా వార్తలను నమ్మవద్దని తెలియజేసింది.

Content above bottom navigation