ముఖ్యమంత్రి నివాసం అంటే నిత్యం పదుల సంఖ్యలో నాయకులు వస్తారు.
వందలమంది అధికారులు సమావేశం అయినా అక్కడకు చేరుకుంటారు
నిత్యం తమ సమస్యలు తీర్చాలి అని సీఎం దగ్గరకు వచ్చే సామాన్యులు ఉంటారు
అందుకే అందరికి అందుబాటులో ఉండేలా విశాలవంతమైన భనవం నిర్మిస్తారు..
లేదా అద్దెకు అయినా తీసుకుంటారు.
ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అమరావతిలో రాజసౌథం లాంటి సొంత ఇళ్లు ఉంది
కాని మూడు రాజధానులు ప్రకటించి ఇప్పుడు విశాఖని పరిపాలన రాజధానిగా మార్చారు.
ఈ సమయంలో విశాఖలో సీఎం నివాసం ఏం తీసుకోవాలి అని అధికారులు వెతుకులాట ప్రారంభించారు.
ఈ సమయంలో ఆయన కొత్త ఇంటి కోసం వైయస్ భారతీ రంగంలోకి దిగారట,
ఇంతకీ ఏమా స్టోరీ ఇప్పుడు చూద్దాం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఇటీవల విశాఖపట్నాన్ని సందర్శించారు. గతంలో విశాఖకు ఆమె పలుమార్లు వచ్చినా.. తాజా పర్యటన మాత్రం ఆసక్తికరంగా మారింది. దీని కారణం లేకపోలేదంటున్నారు. త్వరలో ఏపీ రాజధానిని విశాఖకు తరలించాలన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నేపథ్యంలో.. విశాఖలో ఎక్కడ ఉండాలి? ఏ ఇంట్లో నివాసం ఉండాలన్న అంశానికి సంబంధించిన పని మీదనే తాజా టూర్ సాగిందని చెబుతున్నారు.
విశాఖకు వచ్చిన భారతిరి, అప్పటికే అధికారులు ఎంపిక చేసిన కొన్ని భవనాలు చూపించారు. తాము షార్ట్ లిస్ట్ చేసిన భవనాల్ని ఆమెకు చూపించినట్లు అధికారులు చెబుతున్నారు. నౌకాశ్రయ గెస్ట్ హౌస్ తో పాటు.. రుషికొండలోని కొన్ని విశాలమైన భవనాల్ని చూపించారు. భీమిలిలోని జూట్ మిల్ గెస్ట్ హౌస్ ను కూడా చూపించినట్లుగా తెలుస్తోంది. అలాగే భీమిలీలో పారిశ్రామిక వేత్తలకు వ్యాపారవేత్తలకు గెస్ట్ హౌస్ లు విల్లాలు ఉన్నాయి, అవి కూడా చూపించారట.

అయితే.. అధికారులు షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలోని ఇళ్లు పెద్దగా ఆకట్టుకునే లా లేవన్న సమాచారం వినిపిస్తోంది. అమరావతికి సమీపంలో ప్రస్తుతం ఉన్న భవనానికి తగ్గట్లుగా విశాఖలోని భవనం ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి ఎంపిక చేసినవి నచ్చని నేపథ్యంలో మరిన్ని భవనాల్ని ఎంపిక చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నట్లుగా సమాచారం. అయితే నాయకులు ప్రజలు ఎక్కువమంది వస్తారు కాబట్టి దానికి అనుగుణంగా ఇళ్లు చూడాలి అని చెప్పారట. మొత్తానికి పరిపాలనలో బీజీగా ఉన్న సీఎం జగన్, ఇంటి బాధ్యతని సతీమణి భారతీకి అప్పగించారు అని తెలుస్తోంది.