వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ రాజీనామా

77

జిల్లాలో వైసీపీ నేతల మధ్య విబేధాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా నందికొట్కూరు నియోజకవర్గం రాజకీయాల గురించి వార్తలు రాని రోజు లేదంటే అర్థం చేసుకోవచ్చు. యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి-ఆర్థర్ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. అటు బైరెడ్డి వర్గం.. ఇటు ఆర్థర్ వర్గంగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు విడిపోయారు. అలా మొదలైన వర్గపోరు ఆర్థర్ రాజీనామా దాకా వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా.. ఇవాళ ఉదయం 11 గంటలకు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు.

ఈ ప్రెస్‌మీట్‌ అనంతరం ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. యువనేత బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి ప్రతిపాదించిన వ్యవసాయ మార్కెట్‌ కమిటి పాలకవర్గాన్ని నియమించారని ఎమ్మెల్యే ఆర్థర్‌ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కాగా.. గండ్రెడ్డి ప్రతాపరెడ్డి పేరును ఎమ్మెల్యే ప్రతిపాదించగా ఛైర్మన్‌ పదవి ఆయనకు దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనై రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్థర్ ఏం నిర్ణయం తీసుకుంటారా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆర్థర్ వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థర్ ఇలా తన అసంతృప్తిని వెల్లగక్కడం గమనార్హం. మరోవైపు.. ఎన్నికల్లో తేడాలొస్తే పదవులు ఊడతాయ్ అని సీఎం జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Content above bottom navigation