సీఎం జగన్ మరొక కీలక నిర్ణయం ఈసారి టార్గెట్ సిబిఐ కోర్టులు

          ఏపీలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్న సీఎం జ‌గ‌న్  తాజాగా ప‌రిపాల‌న‌లో త‌న స‌త్తా చాటుతున్నారు.. నెల‌కి ఓ కొత్త సంక్షేమ కార్య‌క్ర‌మాన్ని తీసుకువ‌స్తున్నారు సీఎం జ‌గ‌న్ , తాజాగా అమ్మ ఒడి ప‌థ‌కం తీసుకువ‌చ్చారు, పెద్ద ఎత్తున ఈ ప‌థ‌కం కూడా ప్ర‌జ‌ల‌కు చేరింది.

వైసీపీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో కీలకమైన నిర్ణయాలని తీసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సీఎం జగన్ ప్రభుత్వం తాజాగా మరొక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానాల పరిధిని నిర్ధారిస్తూ సీఎం జగన్ ప్రభుత్వం తాజాగా ఒక నోటిఫికేషన్ ని విడుదల చేసింది. కీలక ప్రాంతాలైన విజయవాడ, విశాఖల్లోని సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానాలకు కొన్ని పరిమితమైన పరిధిలను నిర్ణయిస్తూ రాష్ట్ర న్యాయశాఖ ఒక నోటిఫికేషన్ ని విడుదల చేసింది.

సీబీఐ కోర్టుల పరిధిపై జగన్ ప్రభుత్వం కీలక ఆదేశాలు...

వాటితోపాటే విశాఖ లోని సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం పరిధిని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల వరకు ఉందని ఏపీ ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వుల్లో అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా రాష్ట్రంలో నూతనంగా విజయవాడలో ఏర్పడినటువంటి సిబిఐ కి సంబందించిన అదనపు కేసుల న్యాయస్థానం పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధి వరకు మాత్రమే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసులను కాకుండా ఇతర కేసులను విజయవాడలోని ఐదో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు చేపడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజాగా జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న ఈ నిర్ణ‌యం పై చాలా మంది హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు, అన్నీ ప్రాంతాల అభివృద్దికి ఇది మంచి శుభ‌ప‌రిణామం అంటున్నారు.

Content above bottom navigation