చంద్రబాబు అరెస్ట్ ? రూ. 2000 కోట్ల స్కామ్‌ లో ఆధారాలు..?

57

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారా.. అధికారం కోల్పోయిన ఆయన్ను ఇప్పుడు వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయా.. ఇటీవల వరుసగా టీడీపీ నేతలు, చంద్రబాబు మాజీ పీఎస్ పై జరిగిన ఐటీ దాడులు ఆయన అక్రమాలకు సాక్ష్యాధారాలు సంపాదించి పెట్టాయా.. ఇప్పడు రాజకీయ వర్గాల్లో ఈ అనుమానాలు కలుగుతున్నాయి. ఆదాయపు పన్నుశాఖ వలలో ఓ తిమింగళమే పడింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 2000 కోట్ల రూపాయల నల్లధనం వివరాలు ఆదాయపు పన్ను శాఖ చేతికి చిక్కాయి. ఈ నెల ఆరున దేశ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో చేసిన సోదాల్లో ఈ వివరాలు వెలుగు చూసినట్టు తెలుస్తోంది. వీటికి చంద్రబాబుకు మధ్య సంబంధం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Image result for చంద్రబాబు

స్వయంగా చంద్రబాబుకు పర్సనల్ సెక్రటరీ గా పని చేసిన శ్రీనివాస్ చౌదరి సహా ఆయా వ్యక్తులు, సంస్థల మీద జరిపిన దాడులలో రెండు వేల కోట్ల రూపాయలకు పైగా చేతులు మారినట్లు ఆదాయపన్నుశాఖ ప్రకటించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ మేరకు ఆదాయపన్ను శాఖ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ప్రకారం.. ఈ నెల ఆరున దేశ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో రెండు వేల కోట్లకుపైగా అనధికారిక లెక్కలను గుర్తించింది. ఈ తనిఖీలు ఎక్కడెక్కడ జరిగాయంటే.. కడప, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, దిల్లీ, పూణెలతోపాటు మరో 40 ప్రాంతాల్లో సోదాలు జరిగినట్టు తెలుస్తోంది.

Image result for chandra babu


బోగస్ బిల్లులు, అధిక రేట్లపై ఇన్వాయిస్‌ల ద్వారా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించిన ఐటీ శాఖ… ప్రాథమిక అంచనాల ప్రకారం రూ 2,000 కోట్లు చేతులు మారినట్టు భావిస్తోంది. దాడుల్లో భాగంగా పలు కీలక పత్రాలు, ఖాళీ బిల్లులు, ఈ- మెయిల్స్‌, వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా జరిపిన లావాదేవీలతో పాటు విదేశీ లావాదేవీల వివరాలను సైతం గుర్తించినట్లు తెలిపింది.

ఇక ఈ సోదాల్లో రూ.85లక్షలు నగదు కూడా దొరికిందట. అంతే కాకుండా 71లక్షలు విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారట. 25కుపైగా బ్యాంకు లాకర్లను ఆదాయపు పన్నుశాఖ అధికారులు తమ ఆదీనంలోకి తీసుకున్నట్టు ఆదాయపు పన్ను శాఖ వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని మూడు ప్రముఖ ఇన్‌ఫ్రాస్టక్చర్ గ్రూపులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరిపినట్టు సమాచారం. గతంలో చంద్రబాబు వద్ద పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస చౌదరికి చెందిన నివాసాలు, ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ తనిఖీలు జరిగినట్టు తెలుస్తోంది. బోగస్‌ సబ్ కాంట్రాక్టర్లు, నకిలీ బిల్లులు ద్వారా భారీగా నగదు చెలామణి చేస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. అసలే రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్న చంద్రబాబుకు ఇది మరో షాక్ అనే చెప్పుకోవాలి. చూడాలి మరి ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation