బిగ్ బ్రేకింగ్ : 23మంది ఎంపీలకు కరోనా!!

99

భారతదేశంలోకి కూడా కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చింది. ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికించేసేస్తోంది. ఈ క్రమంలో ఇరాన్‌లో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటి వరకు అక్కడ దాదాపు 2300 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ సోకిన వారిలో 23 మంది ఎంపీలు ఉన్నారు. 290 మంది ఎంపీల్లో 23 మందికి ఈ వ్యాధి సోకింది. ఇక ఆ దేశ ఉపాధ్యక్షురాలికి మసౌమె ఎబ్తేకర్‌ కూడా ఈ వ్యాధి సోకడం ఆందోళన కలిగించే అంశం. అలాగే ఉన్నతాధికారులకు కూడా కరోనా వైరస్ సోకింది. ఆ దేశ అధ్యక్షుడు కూడా కరోనా బారిన పడ్డారనే వార్తలు కూడా హల్‌చల్ చేస్తున్నాయి.

Image result for corona various

కరోనా భయంతో కోట్లాది మంది ప్రజలు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ బతుకుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 80 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. దీంతో మిగిలిన దేశాలు కరోనా రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవటంలో చాలా చాలా సీరియస్ గా పనిచేస్తున్నాయి. ఇన్నాళ్ళు భారత్ కి రాని కరోనా ఇప్పుడు భారత్‌ని వణికించేస్తోంది. అలాగే గల్ఫ్ దేశాలను కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురు అవుతున్నాయి.

ఈ క్రింది వీడియో చూడండి

అంతేకాదు మూడు లక్షల మంది సైనికులకు కూడా కరోనా వైరస్ టెస్ట్ లు చేస్తున్నారు. కాగా..దేశంలో ఇద్దరు సీనియర్ అధికారులకు కరోనా సోకింది. కరోనా సోకిన వారిలో దేశ అత్యవసర వైద్య సేవల అధిపతి కూడా ఈ కరోనా బారినపడ్డారని ఆ దేశపు వార్త సంస్థ తెలిపింది. దీంతో ఇరాన్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. సరిహద్దున ఉన్న దేశాలకు విస్తరించకుండా చర్యలు తీసుకుంటుంది. అలాగే ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ వస్తుంది. ఇక మన దేశానికి కరోనా ముప్పు తీవ్రంగా ఉందని అంటున్నారు. ఈ వైరస్ క్రమంగా విస్తరించే అవకాశం ఉన్న నేపధ్యంలో మన ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అటు ప్రజల్లో ఆందోళనలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి. కాగా ఇప్పటికే ఇరాన్ లో కరోనా వచ్చి 77మంది మృతి చెందారు. మరో 2336 కేసులు నమోదయ్యాయి.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation