8 నెలల గర్భంతో అసెంబ్లీ సమావేశాలకు.. యువ ఎమ్మెల్యేకు హ్యాట్సాఫ్

55

చ‌ట్ట స‌భ‌లు అంటే ప‌విత్ర స్ధ‌లాలుగా మ‌న రాజ్యాంగ నిర్మాత‌లు భావించారు..నిజ‌మే కొంద‌రు అవినీతి అక్ర‌మాలు బంధుప్రీతీ లేకుండా రాజ‌కీయాలు చేస్తూ ఉంటారు.అలాంటి వారిని ఇప్ప‌టికే ప్ర‌జ‌లు చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపుతూ ఉంటారు.మ‌హిళా మ‌ణులు కూడా ఆకాశ‌మే హ‌ద్దుగా రాజ‌కీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతున్నారు
అలాంటి ఓ మ‌హిళానాయ‌కురాలి గురించి నేడు దేశం చ‌ర్చించుకుంటోంది.మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే. 8 నెలల గర్భంతో అసెంబ్లీకి హాజరై అందరితో జేజేలు అందుకుంటున్నారు. ఆమే 30 ఏళ్ల నమిత ముందాడ. ఒకప్పుడు భ్రూణ హత్యలతో అపఖ్యాతి మూటగట్టుకున్న బీడ్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఓ మహిళ.. శక్తివంతమైన ఎమ్మెల్యేగా అందరికీ ఆదర్శంగా నిలవడం విశేషం. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన తొలి గర్భిణిగా తనను గుర్తిస్తున్నారు.

మహారాష్ట్ర రాజకీయాల్లో కురువృద్ధుడు శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీ నుంచి కీల‌క నేతగా ఎదిగారు నమిత.. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు చివరి నిమిషంలో బీజేపీ చేరి టికెట్ దక్కించుకున్నారు. బీడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ సభ్యురాలిగా ప్రజా సమస్యలపై తన గళం వినిపిస్తున్నారు.గర్భం దాల్చడం ఒక రోగం కాదు.. మహిళ జీవితంలో ఇదో పరిణామం అని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నమిత ముందాడ అన్నారు. తనపై సానుభూతి ప్రదర్శించాల్సిన అవసరం లేదని చెప్పకనే చెప్పారు. తద్వారా తాను ఎంతటి శక్తిమంతమైన మహిళో తెలియజేశారు.అందరు గర్భవతుల మాదిరిగా నేను కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. అయితే.. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూనే ఎమ్మెల్యేగా నా విధులు కూడా నిర్వర్తిస్తున్నాను. ప్రస్తుతం బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు హాజరై నా నియోజకవర్గ ప్రజల సమస్యలపై మాట్లాడటం నా బాధ్యత’ అని నమిత ముందాడ అన్నారు. నమిత ధైర్యానికి అభిమానులు శెభాష్ అంటున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

కొంత మంది ప్రజాప్రతినిధులు చిన్నచిన్న కారణాలతో కీలకమైన సమావేశాలకు డుమ్మా కొడుతుంటారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలకు మొక్కుబడిగా హాజరవుతుంటారు. అలాంటి వారు ఈ యువ ఎమ్మెల్యేను స్ఫూర్తిగా తీసుకొనైనా పద్ధతి మార్చుకుంటే.. రాజకీయ నేతలపై ప్రజల్లో గౌరవం పెరిగే అవకాశం ఉంది. మ‌రి ఈ ఎమ్మెల్యే చాలా మందికి ఆద‌ర్శ‌వంతురాలిగా ఉన్నారు,అంతేకాదు నియోజ‌క‌వ‌ర్గంలో ఆమె రోజూ రెండు గంట‌లపాటు ఆమె ఆఫీసులో ఉంటారు, ప్ర‌జ‌ల‌కు ఎలాంటి స‌మ‌స్యలు ఉన్నా నేరుగా వ‌చ్చి కంప్లైంట్ ఇవ్వ‌చ్చు, అక్క‌డిక‌క్క‌డే ఆమె వాటిని ప‌రిష్క‌రిస్తార‌ట‌. నిజంగా ఆమెని గ్రేట్ ఉమెన్ అనాల్సిందే..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation