breakingnews : ఆప్ ఎమ్మెల్యేపై కాల్పులు.. ఒకరి మృతి

113

ఢిల్లీ ఎన్నికల్లో దాదాపు ఆప్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 62 చోట్ల గెలవగా, బిజెపి కేవలం 8 చోట్ల మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ ను కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీలో ఆనందం వెల్లువిరుస్తోంది. కేజ్రీవాల్ సహా గెలిచిన ఆప్ ఎమ్మెల్యేలంతా సంతోషకరమైన వాతావరణంలో పండుగ చేసుకుంటున్నారు. ఊరు వాడా అంతా ఆప్ కార్యకర్తలు నేతలతో ఆహ్లాదంగా గడిచిపోయిన సమయంలో పెద్ద ఉపద్రవం ఆప్ కు వచ్చిపడింది.

ఈ క్రింద వీడియో చూడండి:

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కాన్వాయ్ పై కాల్పులు కలకలం రేపాయి. ఎన్నికల్లో గెలిచి విజయోత్సాహం లో ఉన్న నరేష్ యాదవ్ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని ఆగంతకులు కాల్పులు జరిపారు. ఎమ్మెల్యే కాన్వాయ్‌పై ఆ దుండగుడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఎమ్మెల్యే నరేష్ పక్కనే ఉన్న అశోక్ మాన్ అనే ఆప్ కార్యకర్త మృతిచెందారు. మరో కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఆప్ గెలుపును జీర్ణించుకోలేకనే ప్రత్యర్థులే తనను చంపాలని చూశారని, ఈ కాల్పుల్లో తమ కార్యకర్తలు అసువులు బాసారని ఎమ్మెల్యే అశోక్ వాపోయారు. తన కాన్వాయ్ పై కాల్పులకు దిగిన ఆగంతకులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే నరేష్ డిమాండ్ చేశారు. సీసీఫుటేజీ పరిశీలించి ఆగంతుకులను పోలీసులు గుర్తించాలని అరెస్ట్ చేయాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Image result for ఆప్ ఎమ్మెల్యేపై కాల్పులు.. ఒకరి మృతి

తాజా ఎన్నికల్లో నరేష్‌ యాదవ్‌ మెహ్‌రౌలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆప్‌ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు జరగటం ఢిల్లీలో చర్చనీయం అంశంగా మారింది. దుండగుడు ఎవరు, నరేష్ కి అతనికి ఏమైనా శత్రుత్వం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో వెల్లడికానుంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన నరేష్ యాదవ్ కాన్వాయ్‌పై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఈ దాడిలో మరణించింది ఆప్ కార్యకర్త అశోక్ మన్ అని గుర్తించారు. ఎమ్మెల్యేపై దాడికి దిగిన నిందితున్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఈ విషయంపై ఆరా తీశారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. సీఏఏ విషయంలో రోజుకో ఆందోళన జరుగుతున్న సమయంలో ఇటువంటి ఘటన చోటుచేసుకోవడంపై పోలీసులు సీరియస్ అవుతున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation