అందమైన పెళ్లాం ముందే ఆంటీతో రాసలీలలు రాజకీయ నాయకుడి భార్య ఆవేదన

పెళ్లై  అందమైన భార్య ఇంట్లో ఉన్నా వయస్సు మళ్లిన మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఆస్తులన్నీ ఆంటీ పేర రాసేస్తున్నాడని వాపోయింది ఒక రాజకీయ నాయకుడి భార్య. ఇన్నాళ్లు గుట్టుగా బయట సాగిన వ్యవహారం ఇప్పుడు ఇంటిలోకి వచ్చి భార్య ముందే ఆంటీతో సరసాలాడుతుంటే సహించలేని భార్య  తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. 

tamilnadu dmk leader

చెన్నైలోని అడయార్ ఇందిరానగర్ కు చెందిన రమ్యకు వడియంబాడికి చెందిన సారధికుమార్ తో 2016లో వివాహం అయ్యింది. సారధి కుమార్ వడియంబాడి నగర డీఎంకే కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. పొలిటికల్ పార్టీలో ఉండటంతో సహజంగానే పలువురు ప్రముఖులతో పాటు పలుకుబడిగల  రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సారధి కుమార్ కు సేలంకు చెందిన ఒక ఆంటీతో పరిచయం ఏర్పడింది. తన భర్త కంటే ఆ మహిళ 15 ఏళ్లు పెద్దదని…. అయినా సారధికుమార్ ఆమె మోజులో పడిపోయాడు అని రమ్య ఆరోపించింది. సేలం ఆంటీ మోజులో పడిన సారధి కుమార్ రమ్యకు చెందిన 14 సవర్ల బంగారు నగలు తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టగా వచ్చిన నగదు తీసుకు వెళ్లి అక్రమ సంబంధం సాగిస్తున్న ఆంటీకి ఇచ్చినట్లు రమ్య తెలిపింది. తండ్రి తన పేరున రాసిన ఆస్తిని కూడా అమ్మి ఆంటీకి సమర్పించాడని కన్నీళ్లు పెట్టుకుంది. అదేమని ప్రశ్నిస్తే దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరించాడని చెప్పింది. 

భర్త ఆంటీ తో కలిసి ఉన్నకొన్ని ఫోటోలను రమ్య పోలీసు కమీషనర్ కు అందించింది. ఇన్నాళ్లు పరువుపోతుందనే భయంతో భర్త చేసే కార్యకలాపాలు అన్నీ భరించానని … భర్త బరి తెగించి ఆంటీని ఇంటికి తీసుకువచ్చి తన ముందే అసభ్యంగా ప్రవర్తిస్తుంటే చూడలేకపోయానని వాపోయింది. అనేక సార్లు ఇదేంటని భర్తను ప్రశ్నిస్తే చంపుతానని బెదిరించాడని,…తన అత్తగారు కూడా భర్తనే సపోర్టు చేస్తోందని కమీషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోంది. సారధి కుమార్ మీద ఫిబ్రవరి 19 న స్ధానిక అరివాలయం పోలీసు స్టేషన్ లో  ఫిర్యాదు చేసి ఇంటికి తిరిగి వస్తుండగా భర్త మార్గం మధ్యలో అడ్డగించి తన మెడపై కత్తి పెట్టి ఫిర్యాదు వెనక్కి తీసుకోక పోతే చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. తన భర్త నుంచి ప్రాణహాని ఉందని…తనకు  రక్షణ కల్పించి న్యాయం చేయాలని రమ్య పోలీసు కమీషనర్ ను కోరింది. డీఎంకే నేత అరాచకాలు తెలుసుకున్న కమీషనర్,  కేసు నమోదు చేసివిచారణ చేయాలని స్ధానిక పోలీసులను ఆదేశించారు. 

Content above bottom navigation