బ్రేకింగ్ న్యూస్ : ఏపీ సీఎస్ రాజీనామా…?

89

స్థానిక సంస్థల ఎన్నికల సమయాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్ కు మధ్య రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం ప్రభుత్వానికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేసింది. దాంతో ప్రభుత్వం ఎన్నికల కమిషన్ మీద సీరియస్ అయ్యింది. ఏకంగా ఏపీ సీఎం జగన్ ప్రెస్ మీట్ మరీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఆరోపణలు చేశారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సీఎస్ రాజీనామా చేస్తుందని వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

Image result for jagan

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయాలు అన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరపాలని పట్టుదలగా ఉంది. ఎన్నికల సంఘం మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. కరోనా వైరస్ తీవ్రంగా ఉందని తాము ఎన్నికలను జరపలేమని ఎన్నికల సంఘం చెప్తుంది. మాకు తెలియకుండా నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. కేంద్రాన్ని అడిగి నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల సంఘం అంటుంది. ఇక ఇక్కడ సిఎస్ నీలం సహాని తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆమె ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి లేఖ రాసారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని కరోనా వైరస్ లేదని ఆమె పేర్కొన్నారు. అయితే ఇప్పుడు దీనిపై ఎన్నికల సంఘం కోర్ట్ కి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. తాము తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు తప్పుబడుతున్నారు అని ఎన్నికల సంఘం ఆగ్రహంగా ఉంది.

ఈ క్రింది వీడియో చూడండి

అదే విధంగా అధికారులను బదిలీ చేయమని చెప్పినా ఆమె చేయడం లేదు. పై నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఆమె ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని అంటున్నారు. అధికారులను బదిలీ చేయకపోవడం పై ఎన్నికల సంఘం గవర్నర్ ని కూడా కలిసే అవకాశాలు కనపడుతున్నాయి. దీనితో ఈ ఒత్తిడిని ఆమె భరించలేక ఇబ్బంది పడుతున్నారని, రాజీనామా చెయ్యాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఆమె గత కొన్ని రోజులుగా రెవెన్యు శాఖ వ్యవహారాల విషయంలో కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని కాబట్టి రాజీనామా చేసి బయటపడాలని చూస్తున్నారని అంటున్నారు.

Image result for ఏపీ సీఎస్

ఒకవేళ ఎన్నికల సంఘం కోర్ట్ కి వెళ్తే మాత్రం సిఎస్ ఇబ్బంది పడటం ఖాయం. కాగా ఇప్పటికే ఎన్నికలను నిర్వహించాలని ఏపీ సర్కార్ సుప్రీం కోర్ట్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. దీనితో ఈరోజు విచారణ జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుంది? వైసీపీ ప్రభుత్వం అనుకున్న విధంగా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే విషయంలో ఏపీ హైకోర్టులో కూడా ఓ పిటిషన్ దాఖలైంది. ఐతే… సుప్రీంకోర్టులో ఆల్రెడీ దాఖలైనందువల్ల ముందు సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చాక తాము నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. మరోవైపు మహారాష్ట్ర, బెంగాల్‌లో కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని… స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేశారు. ఐతే… ఆ రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్షాలన్నీ ఈ విషయంలో ఒకే అభిప్రాయంతో ఉండటం వల్ల అక్కడ దీనిపై దుమారం రేగలేదు. ఏపీలో అధికార పార్టీ… ఎస్ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం వల్ల ఈ సమస్య తలెత్తింది. సుప్రీంకోర్టు గనక ఎన్నికలు జరపాల్సిందే అంటే… ఎస్ఈసీ ఆఘమేఘాలపై ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఎన్నికల వాయిదాను సమర్థిస్తే… నెక్ట్స్ ఎప్పుడు జరుగుతాయో తేలాల్సి ఉంటుంది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation