జగన్ బావ బ్రదర్ అనిల్‌కు రోడ్డు ప్రమాదం

క్రైస్తవ మత ప్రబోధకుడు,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపాడు మండలం గరికపాడు సమీపంలో ఆయన వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. అయితే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో బ్రదర్ అనిల్ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది.

Brother Anil Kumar, Brother Anil Kumar: బ్రేకింగ్.. బ్రదర్ అనిల్ కుమార్‌కు తప్పిన ప్రమాదం

ఉద‌యం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా బద్రర్ అనిల్ కారు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న పొలాల్లో దూసుకెళ్లింది అని అక్క‌డ స్ధానికులు పోలీసుల‌కి తెలిపారు …వెంట‌నే ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో బ్రదర్ అనిల్ క్షేమంగా బయటపడ్డారు లేక‌పోతే పెను ప్ర‌మాదం జ‌రిగేది అని పోలీసులు చెబుతున్నారు.ఆయనతో పాటు… గన్ మేన్, డ్రైవర్‌కు పలు గాయాలు కావడంతో.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న జగ్గయ్య పేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సాధినేని ఉదయభాను వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కృష్ణా జిల్లా గరికపాడు చెక్ పోస్టు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ప్రథమ చికిత్స త‌ర్వాత బ్రదర్ అనిల్ అక్కడ్నుంచి తన పర్యటనకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక ఈ ఘ‌ట‌న గురించి వైసీపీ నేత‌లు వైయ‌స్ కుటుంబీకులు కంగారు ప‌డ్డారు, దీని గురించి ఆందోళ‌న చెంద‌వ‌ద్దు అని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు, ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిపోయార‌ని క్షేమంగా ఉన్నారు అని చెప్పార‌ట‌, అయితే బావ‌కి ఏం జ‌రిగిందా అని సీఎం జ‌గ‌న్ హ‌స్తిన నుంచి ఆయ‌న‌కు నేరుగా ఫోన్ చేసి వివ‌రాలు తెలుసుకున్నార‌ట‌. ఇక వైయ‌స్ కుటుంబీకులు అనిల్ కుటుంబ స‌భ్యులు ష‌ర్మిల కంగారు పడ్డారు, అయితే ఈ ప్ర‌మాదంలో పెద్ద గాయాలు కాలేదు అని తాను క్షేమంగా ఉన్నాను అని అనిల్ కుటుంబ స‌భ్యుల‌కి తెలిపార‌ట‌. దీంతో కుటుంబ స‌భ్యులు వైసీపీ నేత‌లు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation