ఏపీ మంత్రి అనిల్ కి కరోనా పరిక్షలు..రిపోర్ట్ లో ఏం తేలింది

ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌స్ మ‌హమ్మారి త‌న పంజా విసురుతోంది.. దేశంలో ఇప్ప‌టికే నాలుగు వేల పాజిటీవ్ కేసులు న‌మోదు అయ్యాయి…వైర‌స్ మహమ్మారి తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో 300కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటుంది. ..ఇక తెలంగాణలో అయితే ఇప్పటికే 11 మంది ఈ మహమ్మారి బారిన పడి చనిపోగా – తెలంగాణాలో కేసుల సంఖ్య 400 కి చేరువలో ఉంది. ఇక ప్రజాప్రతినిధులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిర్దారణ పరీక్షలు చేయించుకుంటున్నారు.

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ హీరోయిన్ ఊర్వశి రౌటేలా

corona test for ap minister anil kumar yadav

తాజాగా ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల ఆయన కలిసిన ఓ డాక్టర్ కు పాజిటివ్ రావడంతో ముందు జాగ్రత్తగా క్వారంటైన్ లోకి వెళ్లారు. తన రక్త నమూన సేకరించి వైద్యులు పరీక్షించగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో కార్యకర్తలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 5న నెల్లూరుకు చెందిన ఓ వైద్యునికి పాజిటివ్ వచ్చింది. ఇటీవల ఆయన తన ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మంత్రి అనిల్ను కూడా ఆహ్వానించారు.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న మౌని రాయ్

ఈ క్రమంలో అతనితో దగ్గరగా కాంటాక్ట్ అయిన వారిలో ఆందోళన మొదలైంది. మంత్రి కూడా ముందు జాగ్రత్తగా రెండు రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఆదివారం తన రక్త నమూన పంపించగా.. నెగిటివ్ అని తేలింది. నెగటివ్ అని తేలడంతో మంత్రి అనిల్ కుమార్ ఇక వైరస్ కార్యక్రమాలపై తిరగాలని డిసైడ్ అయ్యారట‌.

Content above bottom navigation