అర‌వింద్ కేజ్రీవాల్ రియ‌ల్ స్టోరీ

దేశ రాజకీయాలకు, జాతీయ పార్టీల బల ప్రదర్శనకు ప్రధాన వేదికగా నిలిచే రాజధాని ఢిల్లీలో సామాన్యుడి పార్టీ మరోసారి సత్తా చాటుకుంది.ప్రజా సంక్షేమం, అవినీతి రహిత పాలనే అస్త్రాలుగా బరిలోకి దిగిన ఆ ధైర్యం ముందు బడా రాజకీయ దిగ్గజాల వ్యూహాలు చిన్నబోయాయి.2020 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి చీపురుపట్టి ఢిల్లీని ఊడ్చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 70 స్థానాలకు గానూ 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. హస్తినలో ఆయా పార్టీల హస్తరేఖలు మారిపోవడంపై ఆసక్తి నెలకొంది. మ‌రి అలాంటి స‌త్తా చాటిన దిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ రియ‌ల్ స్టోరీ స‌క్సెస్ మంత్ర తెలుసుకుందాం.

Image result for kejrival telugu

అరవింద్ కేజ్రివాల్ భారతీయ సామాజికవేత్త రాజకీయ నాయకుడు. హర్యానాలో శివాని, భివాని జిల్లా, లో జ‌న్మించారు…గోబింద్ రామ్ కేజ్రీవాల్ గీతా దేవి దంప‌తుల‌కి 16 Aug 1968లో ఆయ‌న‌ జ‌న్మించారు. చిన్న‌త‌నం నుంచి చ‌దువులో చాలా బాగా ప్ర‌తిభ చూపించారు, అలా ఐఐటి ఖరగపూర్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులు అయ్యారు. డిగ్రీ పూర్త‌యిన వెంట‌నే ఆయ‌నకు టాటా స్టీల్‌లో ఉద్యోగం ల‌భించింది. అందులో ఇమ‌డ‌లేక త‌న మ‌నఃసాక్షి ప్ర‌కారం సివిల్స్ రాసేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1993 లో సివిల్ స‌ర్వీసు ప‌రీక్ష‌ల్లో పాస‌యి కేజ్రీవాల్ ఇండియ‌న్ రెవెన్యూ సర్వీసెస్‌లో చేరారు. 1995 లో త‌న తోటి ఐఆర్ఎస్ అధికారిని అయిన సునీత‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు. ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు..అర‌వింద్ కేజ్రీవాల్ చాలా నిరాడంబ‌రంగా ఉంటారు. ఆయ‌న శాకాహారి. రాజ‌కీయాల‌ను మిన‌హాయిస్తే, ఆయ‌న ప్ర‌ముఖ‌ బాలీవుడ్ న‌టుడు ఆమీర్ ఖాన్ అభిమాని.. హ‌స్య భ‌రిత సినిమాలను ఆయ‌న ఇష్ట‌ప‌డుతుంటారు. త‌న డెస్క్‌ను శుభ్రం చేసుకోవ‌డానికి ప్ర‌త్యేకంగా నౌక‌రు అవ‌స‌రం లేకుండా త‌న ప‌నుల‌ను తానే చేసుకోవ‌డాన్ని ఇష్ట‌ప‌డుతుంటారు. చివ‌రికి త‌న పిల్లల పుట్టిన రోజుల‌ను జ‌రుపుకోవ‌డం కూడా ఇష్ట‌ప‌డ‌నంత నిరాడంబ‌రంగా ఉంటారు.

Image result for అర‌వింద్ కేజ్రీవాల్

జన లోకపాల్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి చేసిన పోరాటం అలాగే సమాచార హక్కు చట్టం కోసం చేసిన పోరాటంతో ఈయన దేశవ్యాప్తంగా మంచి ప్రాముఖ్యత సంపాదించారు. సమాచార హక్కు చట్టం తీసుకురావటం అలాగే పేదవారి స్తోమత పెంచడానికి చేసిన కృషికి 2006 లో రామన్ మెగసెసే పురస్కారం లభించింది.. 1999 డిసెంబరులో కేజ్రివాల్ రెవెన్యూ సర్వీసులో ఉండగానే, పరివర్తన్ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసి ఢిల్లీలోని ప్రజలకు పన్నులు, విద్యుత్తు, ఆహార పంపిణి విషయాల గురించి అవగాహన కలిగించడంలో సహాయం చేశారు. మార్పు చిన్న చిన్న విషయాలతో ప్రారంభం అవుతుంది అని ఆయ‌న‌ నమ్మేవారు… 2008 లో ఈ సంస్థ ఢిల్లీ నకిలీ రేషను కార్డు స్కాంను బట్ట బయలు చేసింది… అలాగే సమాచార హక్కు చట్టం వినియోగించి ఢిల్లీ లోని ప్రభుత్వ సంస్థలలో అవినీతిని వెలికితీశారు.అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారేతో కలిసి జన లోక్ పాల్ బిల్లు బిల్లు కోసం పోరాడారు.

Image result for అర‌వింద్ కేజ్రీవాల్

ఈ స‌మ‌యంలో రాజ‌కీయాల్లోకి రావాలి అని ఆసక్తి వ‌చ్చింది… 2012 లో ఆమ్ ఆద్మీ పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన తరువాత జరిగిన తొలి ఎన్నికలైన 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికల విజయంతో ఢిల్లీ 7వ ముఖ్యమంత్రిగా పదవి చేబట్టారు. కేజ్రివాల్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో అత్యంత చిన్న‌వ‌య‌సు క‌లిగిన వ్య‌క్తిగా రికార్డు న‌మోదు చేశారు.2013 డిసెంబరు 4 న జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ పై 25, 864 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు..జన్ లోక్‌పాల్ బిల్లు ఢిల్లీ శాసనసభలో ఆమోదం పొందకపోవడంతో కేజ్రీవాల్ 49 రోజుల తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఇది పెను సంచ‌ల‌నంగా మారింది దేశంలో.

Image result for అర‌వింద్ కేజ్రీవాల్

2014 పార్లమెంటు ఎన్నికలలో వారణాసి పార్లమెంటు బరిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పై అరవింద్ కేజ్రివాల్ పోటిపడ్డారు..ఢిల్లీలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి తప్పుకున్న కేజ్రీవాల్ వారణాసిలో భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్రమోడీకి పోటీగా బరిలోకి దిగారు. కానీ ఆయన చేతిలో ఓడిపోయారు. అయినా హ‌స్తిన‌లో త‌న పార్టీ పోరాటం చేస్తూనే ఉంది.2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ముందుండి నడిపించారు. 70 స్థానాలలో 67 స్థానాలు సాధించి అనూహ్య విజయం పొందారు, దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు. కేజ్రివాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి 31, 583 వోట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇప్పుడు 2020లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజార్టీతో గెలుపొందారు. ఎక్క‌డా అవినీతి లేని పాల‌న చేయ‌డంతో ఆయ‌న‌కు ఈ విజ‌యం వ‌చ్చింది , రాజ‌కీయ ఆరోప‌ణ‌లు త‌ప్ప అవినీతి ఆరోప‌ణ‌లు ఆయ‌న‌పై ఉండ‌వు, ఇదే దేశంలో ఆయ‌న‌కు అంత పేరు తెచ్చింది.

ఈ క్రింది వీడియోని చూడండి

ఆయ‌న‌కు వ‌చ్చిన అవార్డులు బిరుదులు చూస్తే
ఇక 2012 లో స్వరాజ్ అనే పుస్తకాన్ని ఆయ‌న ప్రచురించారు.
2004: అశోకా ఫెలో అవార్డు వ‌రించింది
2005:ఐఐటి కాన్పూర్ నుండి సత్యాంద్ర కే దుబే మెమోరియల్ అవార్డు అందుకున్నారు
2006: రామన్ మెగసెసే పురస్కారం అందుకున్నారు
2011: ఎన్.డి.టి.వి ఇండియన్ అఫ్ ది ఇయర్ అన్నా హజారేతో కలిసి అందుకున్నారు
2014 టైమ్ పత్రిక “టైం100″పోల్ విజేతగా ఆయ‌న నిలిచారు

ఇది కేజ్రీవాల్ కి దేశంలో ఉన్న క్రేజ్ …మ‌రి ఆయ‌న స‌క్సెస్ స్టోరీ పై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియ‌చేయండి.

Content above bottom navigation