చిరంజీవి, షర్మిలకు భారీ షాక్ ఇచ్చిన జగన్ ?

68

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభ సీటు కోసం పోటీ మొదలయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 9వ తేదీతో రాష్ట్రం నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు సభ్యులు రిటైరవుతున్నారు. ఆ నాలుగు ఖాళీల భర్తీ కోసం ఈ నెలాఖరులో కానీ, వచ్చే నెల మొదటి వారంలో కానీ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపికి కేటాయించిన టిఆర్‌ఎస్‌ కు చెందిన కె కేశవరావు, కాంగ్రెస్‌ కు చెందిన మహ్మద్‌ అలీఖాన్‌, టి సుబ్బరామిరెడ్డి, టిడిపి ఎంపి తోట సీతామహాలక్ష్మి ఈ ఏప్రిల్‌ లో పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో నాలుగు ఖాళీల భర్తీ ముందుకొచ్చింది. దీంతో ఈ పదవుల కోసం ఇప్పుడు వైసిపి పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది.

వైసీపీ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో, పార్టీలో ఎమ్మెల్సీ పదవిని ఆశించిన వారు రాజ్యసభ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. ఇటువంటి సమయంలో వైసీపీ పార్టీలో వీళ్ళకి జగన్ రాజ్యసభలో స్థానం కల్పించారు అంటూ కొన్ని పేర్లు ఇటీవల ఏపీ మీడియా వర్గాల్లో వార్తలు వినబడుతున్నాయి. చాలామంది పేర్లు వినిపించినా, ఎక్కువగా చిరంజీవి, వైఎస్ షర్మిల పేర్లు గత కొంత కాలం నుండి వినబడుతున్నాయి. జనసేన పార్టీ అధినేత, చిరంజీవి సోదరుడు పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల బిజెపితో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో, ఆయనకు రాజకీయంగా చెక్‌ పెట్టేందుకే వైసిపి చిరంజీవిని రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.. మరోవైపు చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని కేంద్రంలోని బిజెపి పెద్దలు వైసిపికి సిఫారసు చేశారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఈ వార్తలన్నీ నిజం కాదని తెలిసింది.

Image result for chiru jagan sharmila

ప్రస్తుతం రాష్టంలో జరుగుతున్న తాజా పరిస్థితులను చూస్తే… అసలు వీళ్ళిద్దరి పేర్లు రాజ్యసభ రేసులో లేనట్లు వైసీపీ వర్గాల్లో వినికిడి. పార్టీలో వినబడుతున్న సమాచారం ప్రకారం… బీద మస్తాన్ రావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలలో ఒకరికి రాజ్యసభ సీటు దక్కనుందని తెలుస్తోంది. మరో సీటు విషయంలో సీఎం జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పేరు వినిపిస్తోంది. వైవీ సుబ్బారెడ్డి ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ గా ఉన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎంపీ టికెట్ ను వైవీ సుబ్బారెడ్డి త్యాగం చేశారు. అందువలన వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు దక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. నాలుగో సీటు విషయంలో బీజేపీ పేరు తెరపైకి వస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జగన్ ను రాజ్యసభ సీటు కోరినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో చిరంజీవి, వైయస్ షర్మిల కి జగన్ భారీ షాక్ ఇచ్చినట్లు తాజాగా వార్తలు బయటకు వస్తున్నాయి. చూడాలి మరి జగన్ ఎవరెవరికి ఈ రాజ్యసభ సీట్ ను కట్టబెడతాడో.

Content above bottom navigation