బ్రేకింగ్ న్యూస్ : ఏపీలో ఇద్దరు మంత్రులు రాజీనామా…?

83

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెద్ద దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీకి ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడానికి సిద్దమయ్యారు. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

Image result for jagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పటి వరిస్థితులను బట్టి రెండు మంత్రి పదవులు ఖాళీ కానున్నాయి. ప్రస్తుతం మంత్రి వర్గంలో కీలక బాధ్యతలో వున్న మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను జగన్ రాజ్యసభకు ఎంపిక చేసారు. దీనితో నలుగురు బీఫారాలు కూడా తీసుకున్నారు. ఈ నేపధ్యంలోనే వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్దమయ్యారు. మోపిదేవి రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలు కాగా, మండపేట నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోయారు. ఆ తర్వాత వారి ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి కేబినేట్ లోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి. శాసన మండలి రద్దు చేయడంతో వీరి ఎమ్మెల్సీ సభ్యత్వాలు రద్దు అవుతాయి. వారు ఇద్దరు జగన్ కి అత్యంత సన్నిహితులు. దీనితో రాజ్యసభకు పంపించడానికి జగన్ రెడీ అయ్యారు. ఈ ఇద్దరు ఈ నెల 26వ తేదీ తమ మంత్రి వదవులకు రాజీనామా చేసే అవకాశాలున్నాయి.

ఈ క్రింది వీడియో చూడండి

వీరితో పాటుగా ముఖేష్ అంబాని సూచించిన పరిమల్ నత్వాని, అలాగే 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆళ్ళ అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేసారు. వీరిద్దరూ ఇప్పుడు మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్న నేపధ్యంలో వారితో ఖాళీ అయిన మంత్రి పదవులను ఎవరితో భర్తీ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. పిల్లి సుభాష్, మోపీదేవిలు ప్రాతినిధ్య వహించే ఆయా జిల్లాలకు చెందిన వారికే మంత్రులుగా అవకాశం రావొచ్చననే కథనం ప్రచారంలో ఉంది. దీంతో ఆయా జిల్లాల్లో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి.

Image result for ఏపీలో ఇద్దరు మంత్రులు రాజీనామా

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో అదే జిల్లాకు ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కు అవకాశం వస్తుందని భావిస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి మోపిదేవి వెంకటరమణ కారణంగా ఖాళీ కాబోయే స్థానానికి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీకి అవకాశం ఉంటుందన్నారు. ఎన్నికలకు కొన్నాళ్ళకు ముందు ఆమె తెలుగుదేశం నుంచి వైఎస్సాఆర్ కాంగ్రెస్ లోకి వచ్చారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ లోకి వచ్చిన తరువాత ఆమె చిలకలూరిపేట నుంచి పోటీ చేసి గెలుపొందారు. సామాజికవర్గ పరంగా చిలకలూరిపేట ప్రాంతంలో ఉన్నారు రజనీ. ఈమెను ఉప ముఖ్యమంత్రి చేస్తారనే వాదన వినిపిస్తుంది. అయితే జగన్ కచ్చితంగా వీరికే మంత్రులుగా అవకాశం ఇస్తారని చెప్పలేమనే వాదన ప్రచారంలో ఉందంటున్నారు. ఈ నెలాఖరు జరిగే అసెంబ్లీ సమావేశాల నాటికి ఈ చర్చ ముగిసే అవకాశం ఉంది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation