లాక్ డౌన్ పొడగింపు కేంద్రం కొత్త రూల్స్

దేశంలో వైరస్‌ని పూర్తిగా కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గ దర్శకాలు జారీ చేసింది. ఐతే… ఏప్రిల్ 20 తర్వాత మాత్రం కొన్నింటికి మినహాయింపు ఇచ్చింది. వ్యవసాయం, కొన్ని పరిశ్రమలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ యూనిట్లు (Manufacturing units) పరిశ్రమలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అలాగే గ్రామాల్లో భవన, ఇళ్ల నిర్మాణ రంగ కార్యకాలపాలు నిర్వహించుకోవచ్చు. అలాగే… మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో కార్మికులు… నిర్మాణ భవనం దగ్గరే ఉండేటట్లైతే… అక్కడ నిర్మాణాలు జరుపుకోవచ్చు. నిత్యవసర వస్తువులు అంటే మందులు, ఫార్మా ఉత్పత్తులు చేపట్టవచ్చు. గ్రామ ప్రాంతాల్లో అన్ని పరిశ్రమలనూ తెరచుకోవచ్చు.

వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ కృతి కర్భంద

Lockdown 2.0: PM Modi spells out seven-point strategy

సినిమా హాళ్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు, జిమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు, మాత్రం… మే 3 వరకూ తెరవకూడదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాల మధ్య, అలాగే జిల్లాల మధ్య ప్రజల ప్రయాణాలు, రాకపోకలపై కేంద్రం మే 3 వరకూ నిషేధం విధించింది. అలాగే… మెట్రో రైళ్లు, బస్సు సర్వీసులు కూడా మే 3 వరకూ లాక్‌డౌన్‌లోనే ఉంటాయి.లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు ముఖానికి మాస్క్ ధరించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. బయటకు వచ్చినప్పుడు, పని ప్రదేశాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అలాగే… ఆరుబయట ఉమ్మి వేయడం ఇకపై చట్ట ప్రకారం నేరం. దానికి జరిమానా విధిస్తారు.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న శృతి హాసన్ పిక్స్

Entry of trucks banned in Delhi as air quality plunges to 'severe ...

సామాజిక, రాజకీయ, క్రీడా, మతపరమైన కార్యక్రమాలు, వేడుకలు, ఫంక్షన్లు నిర్వహించకూడదు. అన్ని ప్రార్థనా స్థలాలూ మే 3 వరకూ క్లోజ్ చేసి ఉంటాయి. విద్యాసంస్థలు, ట్రైనింగ్, కోచింగ్ కేంద్రాలు… మే 3 వరకూ తెరవకూడదు. అంత్యక్రియల కార్యక్రమాల్లో 20 మందికి మించి పాల్గొనకూడదు.అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలూ లాక్‌డౌన్ నిబంధనల్ని కఠినంగా అమలు చెయ్యాలని కేంద్రం ఆదేశించింది. అవసరమైతే రాష్ట్రాలు స్థానికంగా అవసరాన్ని బట్టీ… ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలన్నా తీసుకోవచ్చని తెలిపింది.

ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, టెలిమెడిసిన్ సర్వీసులు రోజూ పనిచేస్తాయి. అలాగే… డిస్పెన్సరీస్, కెమిస్ట్స్, ఫార్మసీస్, అన్ని రకాల మందుల షాపులు, జన ఔషధి కేంద్రాలు తెరిచే ఉంటాయి. మెడికల్ ల్యాబ్స్, వైద్య ఉత్పత్తుల కలెక్షన్ కేంద్రాలు తెరిచే ఉంచవచ్చని కేంద్రం తన మార్గదర్శకాల్లో తెలిపింది.మినహాయింపులు ఇచ్చిన వాటిని ఏప్రిల్ 20 తర్వాత నుంచి కొనసాగించుకోవచ్చు. మినహాయింపులు లేని వాటిని మాత్రం… మే 3 వరకూ కొనసాగించేందుకు అవకాశం లేదు. మే 3 తర్వాత ఏం చెయ్యాలన్నది అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంతో చెప్పనున్నారు.

Content above bottom navigation