కేంద్ర కేబినెట్ భేటీ… లాక్‌ డౌన్‌పై కీలక నిర్ణయం ?

124

కరోనా ఎఫెక్ట్‌తో పరిస్థితి మొత్తం మారిపోయింది… కేంద్ర కేబినెట్ సమావేశాలు సైతం సామాజిక దూరాన్ని పాటిస్తూ నిర్వహిస్తున్నారు… ఇదే నేపథ్యంలో మునుపెన్నడు లేని విధంగా.. తొలిసారి “వీడియోకాన్ఫరెన్స్” ద్వారా కేంద్ర మంత్రిమండలి సమావేశం కాబోతోంది… వివిధ రాష్ట్రాలలో ఉన్న పలువురు కేంద్ర మంత్రులతో మధ్యాహ్నం 1 గంటలకు ప్రధాని “వీడియో కాన్ఫరెన్స్” నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తోంది. 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది మోదీ ప్రభుత్వం. దాంతో గత 13 రోజులుగా యావత్తు భారతావని ఇంటికే పరిమితం అయ్యింది. మరో 8 రోజుల్లో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. మరి ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై ప్రధాని… కేంద్రమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

PM Modi, Benjamin Netanyahu discuss ways to deal with coronavirus ...

లాక్ డౌన్ ను పొడిగించలా, లేక ఇంతటితో ఆపేయ్యాలా, ఒకవేళ లాక్ డౌన్ ను ఎత్తివేస్తే కోవిడ్ 19 ను ఎలా అదుపు చెయ్యాలి. దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు దాని బారిన పడకుండా ఎలా రక్షించాలి. ఇలా అనేక విషయాల మీద ఈరోజు క్యాబినెట్ చర్చించనుంది. ప్రస్తుతం దేశంలో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి లాక్ డౌన్ ను పొడిగిస్తేనే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. మరోవైపు కరోనా నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలపై కూడా ఆదివారం ప్రధాని పలువురు రాజకీయ నేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌కు ఫోన్ చేశారు ప్రధాని మోదీ. కరోనా నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యల్ని వివరించారు. దీంతో పాటు మాజీ ప్రధానులు దేవగౌడ, మన్మోహన్ సింగ్‌తో మోదీ చర్చలు జరిపారు. కరోనా నివారణ చర్యలపై వారితో చర్చించారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియా, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, బెంగాల్ సీఎం మమత, స్టాలిన్, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ఇలా ప్రముఖ నేతలందరికీ ఫోన్ చేసి కరోనాపై చర్చించారు.

దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య ఇప్పటికే నాలుగువేలు దాటింది. ఇప్పటివరకు భారత్‌లో ఈ వ్యాధి బారిన పడి 124 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏప్రిల్ 6న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం మోదీ లాక్ డౌన్ పై కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Content above bottom navigation