బిగ్ బ్రేకింగ్: 2000 నోట్లపై అర్దరాత్రి సంచలన ప్రకటన చేసిన కేంద్రం..

88

రూ.2000 నోటు మీద గత కొంత కాలంగా రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం 2000 నోటును రద్దు చేస్తుందని, నరేంద్ర మోడీ ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాడు, రేపో ఎల్లుండో 2000 నోటు రద్దు మీద మోడీ ప్రకటన చేయనున్నాడు అని..ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ వార్తలు బాగా వైరల్ అవ్వడంతో, సామాన్యులు తమ దగ్గర 2000 నోటును పెట్టుకోడానికే భయపడే స్థితికి వచ్చారు. 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నోట్ల రద్దు తరహాలోనే ఏ అర్థరాత్రి నుంచో రూ.2000 నోట్లను కూడా రద్దు చేసేస్తారేమోనంటూ ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

ఈ క్రింది వీడియోని చూడండి

దేశ ఆర్థిక గమనాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ తర్వాత రూ.2వేల కరెన్సీ నోటు అందుబాటులోకి వచ్చింది. ఆ నోట్లను కేంద్రం రద్దు చేయనుందని గత మూడేళ్లుగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. అయితే, గతేడాది అక్టోబర్ నుంచి రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపేశామని ఆర్బీఐ అధికారికంగా ప్రకటించడం, ఆ కరెన్సీలో లోపాలపై కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేయడం, బడ్జెట్ ప్రకటించిన వారం రోజులకే రూ.2వేల నోట్లు నిలిపేయాలంటూ బ్యాంకులకు ఆదేశాలు రావడం తదితర పరిణామాలన్నీ ప్రజలను మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా పట్టుపబడుతోన్న నకిలీ కరెన్సీలో రూ.2వేల నోట్ల శాతం రోజురోజుకూ పెరుగుతుండం కూడా రద్దు అనుమానాలను మరింత పెంచాయి. అయితే ఇప్పుడు రూ.2000 నోటుకు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రూ.2000 నోటును రద్దుచేసే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. రూ.2000 నోటును రద్దు చేస్తారనే ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు.

Image result for nirmala sitharaman

ఈనెల 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై పారిశ్రామిక వర్గాల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక పర్యటన చేపట్టారు. అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ వచ్చిన ఆమె.. ఇక్కడి పారిశ్రామికవేత్తలు, బిజినెస్ ప్రముఖులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బడ్జెట్ అంశాలపై వివరణ ఇస్తున్న సమయంలోనే రూ.2వేల నోటు రద్దు ప్రస్తావన వచ్చింది. రూ.2వేల నోట్లను రద్దు చేసే ఆలోచన మోదీ సర్కారుకు లేదని మంత్రి నిర్మల స్పష్టం చేశారు. ఈసారి 2 కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చాయి కాబట్టే 42 నుంచి ఒక శాతం తగ్గించి 41 శాతం నిధులు కేటాయించాం. అదనంగా ఒక శాతాన్ని యూటీలకు కేటాయించాం. కేంద్రం నుంచి నిధులు ఏం తగ్గించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించడం లేదు అనేది సరికాదు. ఏ ఒక్క రాష్ట్రాన్ని చిన్న చూపు చూడాలని మాకు లేదు. తెలంగాణ నుంచి కేంద్రానికి మంచి కాంట్రిబ్యూషన్ ఉంది.’ అని అన్నారు. సెస్ కలెక్షన్ తక్కువ కావడం వల్ల రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ నిధులు ఇవ్వలేకపోయామని నిర్మాలా సీతారామన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికే కాదు.. ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వలేదన్నారు. త్వరలోనే ఈ నిధులు ఇస్తామని చెప్పారు. సెస్ వచ్చే కొద్దీ ఇస్తూనే ఉంటామన్నారు. తెలంగాణకి రూ.4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్న మాట అవాస్తవమని తెలిపారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation